|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు 158: మెగాస్టార్ బెంగాల్ డాన్ అవతార్! బాబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!!

Published: 16-01-2026, 4:00 AM
చిరు 158: మెగాస్టార్ బెంగాల్ డాన్ అవతార్! బాబీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!!
  • చిరంజీవి 158వ సినిమాలో బెంగాల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు.
  • బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది.
  • వింటేజ్ లుక్ లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి కనిపించారు.
  • వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా ఇది.

మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో తన 158వ చిత్రంలో బెంగాల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం

Mega 158: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేసిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ ల సునామీ సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే ఏకంగా 152 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు.

ఇకపోతే సంక్రాంతి రేస్ లో నిలిచి, విజయం సాధించిన చిరంజీవి తదుపరి చిత్రం పై అందరి అంచనాలు పెరిగిపోయాయి. అందులో భాగంగానే బాబి కొల్లి (Bobby Kolli ) దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కెవిఎన్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది అని సమాచారం. ఇకపోతే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో వింటేజ్ లుక్ లో చిరంజీవిని అనిల్ రావిపూడి చూపిస్తే.. బాబీ మాత్రం తన సినిమాలో బెంగాల్ మాఫియా డాన్ గా పవర్ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మెగాస్టార్ ను డాన్ గా బాబీ అభిమానులకు చూపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

బెంగాల్ మాఫియా డాన్ గా చిరంజీవి

ఇదిలా ఉండగా ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అలాంటి కాంబోలో మరో సినిమా వస్తుండడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

బాబీ దర్శకత్వంలో భారీ చిత్రం

ఇదిలా ఉండగా చిరంజీవి మరోవైపు తాను నటించిన విశ్వంభర సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు . ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.గత ఏడాది ఆఖరిలో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈ ఏడాది సంక్రాంతి కైనా వస్తుంది అనుకుంటే అదీ కుదరలేదు. సమ్మర్ కి ఈ సినిమాను వాయిదా వేశారు. కనీసం అప్పుడైనా ఈ సినిమా విడుదలవుతుందా? ఇన్నిసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఇక ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ జోరు మీద ఉన్న చిరంజీవి రెండు వారాలపాటు విరామం తీసుకుని బాబీ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

చిరంజీవి బెంగాల్ మాఫియా డాన్ పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మెగా అభిమానులకు కనులవిందు చేయనుంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.