
Key Points
చిరంజీవి, నానిల వంటి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నాడు తేజ సజ్జా.
మిరాయ్ సినిమా హిట్ అయితే ఫ్రాంచైజీగా మారుతుందని ఆశ.
ప్రస్తుతం జాంబిరెడ్డి 2 సినిమాలో మాత్రమే తేజ సజ్జా కమిట్ అయ్యాడు.
మిరాయ్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించబడింది.
మిరాయ్ సినిమా విజయం
లేటెస్ట్‌గా తెలుగులో విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సినిమా మిరాయ్. తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.
మైథలాజికల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ డిఫరెంట్ పాయింట్‌తో తెరకెక్కిన మిరాయ్ సినిమాలో శ్రీయ సరన్ , జగపతి బాబు, జయరాం వంటి వారు కీలక పాత్రలు పోషించగా బ్యూటిఫుల్ రితికా నాయక్ హీరోయిన్‌గా చేసింది. అయితే, మిరాయ్ మూవీ రిలీజ్‌కు పాల్గొన్న మీడియా ప్రమోషన్స్‌లో తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ విశెషాలు, ఫ్యూచర్ సినిమాల గురించి చెప్పాడు.
– చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలా మంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
ప్రముఖుల నుండి ప్రశంసలు
– కరణ్ జోహార్ గారు ఈ సినిమా చూసి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి ఫిలిం మేకర్స్ బయటికి రావాలి మీకు పెద్ద ప్లాట్‌ఫామ్ ఇస్తానని ప్రమోషన్స్‌కి ఎంత దూరమైనా వస్తానని ఆయన చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్‌గా బ్లెండ్ అయిన కథ ఇది. బలవంతంగా ఇరికించింది కాదు. అది చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఆడియన్స్ రేపు చూడబోతున్నారు.
-సినిమా హిట్ అయితే కచ్చితంగా మిరాయ్ ఫ్రాంచెస్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్టు. ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది.
జాంబిరెడ్డి 2 కమిట్మెంట్
-నేను ఒక సినిమా కమిట్ అయితే అది పూర్తయి రిలీజ్ అయినంత వరకు దానిపైనే ఉంటాను. అందుకే ప్యుచర్ సినిమాలు గురించి ఆలోచించే అంత స్పేస్ ఉండటం లేదు. ఆడియన్స్‌లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి ఉంటుంది. సినిమా రిలీజ్ సమయంలో ఆడియన్స్‌ని థియేటర్స్ పిలిచేటప్పుడు ముందు నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ప్రస్తుతానికి ‘జాంబిరెడ్డి 2’ ఒక్కటే కమిట్ అయ్యాను.
-మిరాయ్ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ఎమోషన్ డివోషనల్ ఎలివేషన్ అన్ని ఉంటాయి. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఆడిటోరియం ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఫిల్ ఇది.
-థియేటర్స్‌లో ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇవ్వాలని ఉద్దేశంతో వర్క్ చేసాము. దాన్ని ఎచీవ్ చేశామని భావిస్తున్నాం. ప్రేక్షకులందరూ అదే ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి తేజ సజ్జా మాట్లాడుతూ, ప్రస్తుతం జాంబిరెడ్డి 2 సినిమాపైనే దృష్టి పెట్టానని తెలిపాడు. మిరాయ్ సినిమా విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు.


