|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Chiranjeevi MSVG: ఓ వైపు ట్రోల్స్‌.. మరోవైపు రికార్డు వ్యూస్‌.. అది మెగాస్టార్‌ క్రేజ్‌ అంటే!

Published: 09-12-2025, 11:08 AM
Chiranjeevi MSVG: ఓ వైపు ట్రోల్స్‌.. మరోవైపు రికార్డు వ్యూస్‌.. అది మెగాస్టార్‌ క్రేజ్‌ అంటే!
  • చిరంజీవి MSVG సినిమా పాటలు భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాయి.
  • ట్రోల్స్ ఉన్నా, ఈ పాటలు రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధిస్తున్నాయి.
  • ‘మీసాల పిల్ల’ 80M వ్యూస్, ‘శశిరేఖ’ పాటలు మొత్తం 100M+ వ్యూస్ దాటాయి.
  • ఇది మెగాస్టార్ చిరంజీవికి ఉన్న తిరుగులేని క్రేజ్‌కు నిదర్శనం.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న MSVG సినిమా పాటలు ఓ వైపు ట్రోల్స్‌కు గురవుతున్నప్పటికీ, మరోవైపు రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సాధిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, మెగాస్టార్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఇది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

MSVG పాటలు: ట్రోల్స్ vs రికార్డులు

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ ‌ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ‌ మూవీ మన శంకర వరప్రసాద్ ‌ గారు . అనిల్ ‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . మెగాస్టార్ ‌ లాంటి హీరో అనిల్ ‌ మూవీ అనగానే అంచనాలు మించిపోయాయి . అలాంటి ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు ట్రోలర్స్ ‌ మంచి స్టఫ్ ‌ గా మారాయి . ఈ రెండు పాటలపై విపరీతమైన ట్రోల్స్ ‌ వస్తున్న ముఖ్యంగా ఇటీవల విడుదలైన శశిరేఖ సాంగ్ ‌ దారుణంగా ఆటాడేసుకుంటున్నారు నెటిజన్స్ ‌. అయితే ఈ పాటు ఓ వైపు ట్రోల్స్ ‌ ఎదుర్కొంటూనే మరో వైపు రికార్డ్స్ ‌ నెలకొల్పుతున్నాయి . అసలేం సంగతేంటో చూద్దాం !

రచయితగా కెరియర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాలకి పనిచేశాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి పనిచేసిన సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ దర్శకుడిగా మాత్రం అనిల్ రావిపూడి 100 శాతం సక్సెస్ రేట్ అందుకున్నాడు. పటాస్ సినిమాతో మొదలైన అనీల్ ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. సీనియర్ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం అనిల్ రావిపూడి కి దక్కింది. బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక 2025 సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక సినిమాకి ఆరెంజ్ కలెక్షన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. చాలావరకు గేమ్ చేంజెర్ సినిమా నష్టాలను ఆ సినిమా పూడ్చివేసింది.

అనిల్ రావిపూడి సినిమాలను కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది సెపరేట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనిల్ రావిపూడి సినిమాలను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్లకు ఎటువంటి అంశాలు సినిమాలో ఉంటే వర్కౌట్ అవుతాయో అనిల్ రావిపూడి కి ఒక క్లారిటీ ఉంది. అందుకనే సినిమాని కూడా టీవీ ప్రోగ్రామ్స్ లోకి వెళ్లి మరి ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర్ వరప్రసాద్ గారు అని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మీసాల పిల్ల పాట విడుదలైనప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు. ఆ పాట ఇప్పుడు దాదాపు 80 మిలియన్స్ వ్యూస్ సాధించుకుంది. అలానే రీసెంట్ ‌ గా శశిరేఖ పాటను కూడా విడుదల చేశారు.

100 MILLION+ cumulative views and counting for the Mega grace and class of #ManaShankaraVaraPrasadGaru ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా

The two chartbusters #MeesaalaPilla and #Sasirekha are dominating music charts everywhere 🔥🔥🔥

— https://t.co/Dj81NJTGnk

Keep vibing to THE BIGGEST & MOST CELEBRATED… pic.twitter.com/5fRZxnKQFL

మెగాస్టార్ క్రేజ్ వెనుక అసలు కారణం

— Shine Screens (@Shine_Screens) December 9, 2025

ఈ పాట 20 మిలియన్స్ వ్యూస్ సాధించుకుంది. అయితే ఈ పాటను విడుదల చేసినప్పుడు క్యాత్యాయిని పాటలా ఉంది అంటూ కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. మొత్తానికి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు పాటలు కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించుకున్నాయి. ఇప్పటికే సినిమా మీద అంచనాలు మొదలైపోయాయి. సినిమా మీద విపరీతమైన హైట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది సినిమాకి సంబంధించి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లు ఈ సినిమాకి చూడొచ్చు. మరోవైపు ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేస్తున్నాడు అనిల్. అనిల్ స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ చిరంజీవి కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అయింది అంటే కాసుల వర్షం కురవడం ఖాయం.

మొత్తం మీద, MSVG సినిమా పాటలపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, అవి సాధిస్తున్న రికార్డు వ్యూస్ మెగాస్టార్ చిరంజీవి స్టార్‌డమ్‌కు అద్దం పడుతున్నాయి. విమర్శలను సైతం విజయంగా మార్చుకోవడం చిరంజీవికి మాత్రమే సాధ్యమని ఈ పరిణామం నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.