
📌 Key Points
- విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఫిబ్రవరి 26, 2026న జరిగింది.
- ఈ జంట ఉదయపూర్ లో హిందూ, కొడవ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు.
- వివాహంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
- విజయ్ తన సొంతూరులో గృహ ప్రవేశం చేసి, పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేస్తానని చెప్పారు.
టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న జరిగింది. ఉదయపూర్‌లో జరిగిన ఈ వేడుకలో హిందూ, కొడవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ సేవా కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
విజయ్, రష్మికల పెళ్లి వేడుక విశేషాలు
Virosh couple: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ (vijay Deverakonda) , రష్మిక మందన్న(Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2018లో వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమాతో తొలిసారి వెండితెరపై జంటగా కనిపించిన వీరు.. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక అప్పటినుంచి ప్రేమలో పడ్డ ఈ జంట ఎప్పటికప్పుడు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా వీరు బహిరంగంగా కలిసి కనిపించలేదు. కానీ వీరు విడివిడిగా కనిపించినా.. వీరు షేర్ చేసిన ఫోటోలలోని బ్యాక్ గ్రౌండ్ వీరు ఒకే చోట ఉన్నారు అనే విషయాన్ని స్పష్టం చేసింది.
దాదాపు 8 సంవత్సరాల పాటు తమ బంధాన్ని అత్యంత రహస్యంగా కొనసాగించిన ఈ జంట.. ఎప్పుడు ఒకటవుతారు అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఏ ఒక్క రోజు కూడా తమ బంధాన్ని ఈ జంట బయట పెట్టలేదు. కానీ ఎట్టకేలకు గత ఏడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకొని.. అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇక ఈ ఏడాది అభిమానులు ప్రేమగా పెట్టిన విరోష్ అనే పదాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తూ.. ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అంటూ ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. డెస్టినేషన్ వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి వేడుకతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఉదయపూర్ లో ఉదయం హిందూ సాంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఈ జంట. ఇక వివాహం చేసుకోవడమే కాదు తమ పెళ్లి దుస్తులతో పాటు ధరించిన నగలతో కూడా అందరిని ఆకర్షించారు.
వివాహం తర్వాత సేవా కార్యక్రమాలు
ఇక అంతేకాదు దాదాపు 23 ప్రధాన నగరాలతో పాటు 16 దేవాలయాల్లో స్వీట్స్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి వార్తల్లో నిలిచిన ఈ జంట.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కూడా.. పైగా విజయ్ దేవరకొండ తమ సొంత ఊరు తుమ్మన్ పేటలో నూతన గృహ ప్రవేశం తో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తన భార్య రష్మికతో కలిసి ఆచరించారు. అనంతరం ఆ ఊరి అభివృద్ధికి పాటుపడతామని చెప్పిన ఆయన.. అదే ఊర్లో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ వివాహం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు అచ్చంపేట పరిధిలో ఉన్న 44 పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తామని తెలిపారు . అలా ఈ జంట తమ పెళ్లితో ఎన్నో వాగ్దానాలను చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సొంతూరు అభివృద్ధికి విజయ్ దేవరకొండ వాగ్దానాలు
ఇకపోతే పెళ్లి తర్వాత తాజాగా ఈ జంట ఎయిర్‌పోర్టులో కనిపించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు నుంచి వీరు రణబాలి సినిమా షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్నారు.. కర్నూల్ లో జరిగే ఈ షూటింగ్లో భాగంగా ఈ జంట తాజాగా ఎయిర్పోర్టులో కనిపించింది. ఇక్కడ చాలా క్యాజువల్ లుక్ లో కనిపించారు. రష్మిక షర్టు ప్యాంట్ తో చాలా సింపుల్ గా కనిపించగా.. అటు విజయ్ దేవరకొండ షర్టు ,షార్ట్ ధరించి మరింత క్యాజువల్ గా కనిపించారు . ఎంత పెళ్లయితే మాత్రం ఇంట్లో ఉన్నట్టు మరీ ఇంత క్యాజువల్ గా కనిపించడం ఏంటి గురు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రణబాలి షూటింగ్లో భాగంగానే వీరు ఇలా ఎయిర్ పోర్ట్ లో కనిపించినట్లు తెలుస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ=
మొత్తానికి విరోష్ జంట తమ వివాహంతో ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి భవిష్యత్తు ప్రణాళికలు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయి.


