
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు పొన్నంబళం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణరక్షణ చేశారు. కానీ, ఆయన మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు.
Key Points
చిరంజీవి 40 లక్షలతో పొన్నంబళంకు ప్రాణరక్షణ.
తమిళ నటుడు పొన్నంబళం మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
పొన్నంబళం కష్టకాలంలో చిరంజీవి చేసిన సహాయం అభినందనీయం.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో పొన్నంబళం పోరాటం.
చిరంజీవి చేసిన అపూర్వమైన సహాయం
ఇండస్ట్రీలో పరిచయం ఉన్న నటులు ఎవరైనా ఆర్థికంగా సాయం చేయాలంటే ఏ పదివేలో లేక 50 వేలో చేస్తుంటారు. మరీ హాస్పిటల్ లో ఉన్నారంటే లక్ష, రెండు లక్షలు సాయం చేసేవారు ఉంటారు. కాని ఓ స్టార్ నటుడు ప్రాణాపాయంల ఉన్నాడని తెలిసి మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 లక్షల విలువైన ట్రీట్మెంట్ ను చేయించి అతన్ని బ్రతికించాడు. ఆ నటుడు ఎవరనో కాదు పొన్నంబళం. కాని ఆయన మరోసారి అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలు అయ్యారు. ఇంతకీ తమిళ నటుడికి ఏమయ్యింది.?
నటుడు పొన్నంబళం గుర్తుండే ఉంటాడు.. విలన్ గా ఆయన పెర్ఫామెన్స్ కు భయపడి దగ్గరకు కూడా వెళ్లేవారుకాదు జనాలు. పొన్నంబళం చిన్నప్పటి నుంచి కోలీవుడ్ ప్రపంచంలో స్టంట్ మ్యాన్‌గా పనిచేసి ఆ తర్వాత పెద్ద విలన్‌గా మారారు.1988లో విడుదలైన “కలియుగం” సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ హిందీ సినిమాల్లో కూడా నటించాడు.
తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విలన్‌గా, స్టంట్ మ్యాన్‌గా నటించిన పొన్నంబళం 35 ఏళ్లకు పైగా ఈ రంగంలో ఉన్నాడు. అయితే ఆయనకు కు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో పాటు.. ఆరోగ్యం దెబ్బతినడంతో బాగా ఇబ్బందులు పడ్డాడు. అన్ని సినిమాలు చేసినా.. ఆయన తీవ్ర పేదరికంలో కూరుకుపోవడంతో వైద్య ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం క్షీణించడంతో.. ఆయన పలువురి సహాయం అడిగాడట.
పొన్నంబళం ఆరోగ్య పరిస్థితి
ఆయనకు తమిళ పరిశ్రమ కంటే కూడా తెలుగు స్టార్ హీరో నుంచే అతిపెద్ద సాయం అందడం విశేషం. అది కూడా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పొన్నంబళం కు సాయం చేశారట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు గుర్తు చేశారు పొన్నంబళం. తన ప్రాణాలు కాపాడి తన దైవంలా మారారు మెగాస్టార్ అంటూ తమిళ నటుడుపొన్నంబళం అంటున్నారు. చిరంజీవి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానన్నారు.
తనను అన్నా వదినలు విషం పెట్టి చంపాలని చూశారు.. కిడ్నీలు రెండు పాడైపోయి.. మంచాన పడటంతో తన పని అయిపోయింది అనుకున్నాడట పొన్నం. ఎవరు సాయానికి ముందుకు రాకపోవడంతో ఆశలు వదలుకున్నారు. చివరి ప్రయత్నంగా మెగాస్టార్ చిరంజీవికి వేడుకున్నాడు తమిళ నటడు. ఇక వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నంబళంకు కావల్సిన సాయం చేశారట.
తెలుగు సినిమా పరిశ్రమలో మానవతా దృశ్యం
అయితే అందరిలాగే లక్ష రెండు లక్షలు ఇచ్చి వదిలేస్తారు అనుకున్నాను కాని ఆయన ఏకంగా ఆసుపత్రి ఖర్చులన్నీ పెట్టుకున్నారు. నాకు కిడ్నీ ప్రాబ్లమ్ రావడంతో అపోలోలో నాకు ట్రీట్మెంట్ చేశారు. దాని కోసం ఆయన దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు పొన్నంబళం. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు.
అయితే లాస్ట్ ఇయర్ కోలుకుని హాస్పిటల్ కు చేరుకున్న పొన్నంబళం ..తాజాగా, మళ్లీ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు వస్తుండటం ఆయన ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఈసారి ఏమైందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
చిరంజీవి చేసిన అపారమైన సహాయం పొన్నంబళం జీవితంలో మలుపు తీసుకువచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.


