
📌 Key Points
- చిరంజీవి తన కుమార్తె సుస్మిత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్ట్ చేశారు.
- సుస్మితను ‘హనీ పాప’ అని పిలుస్తూ చిరంజీవి తన ప్రేమను వ్యక్తపరిచారు.
- ఒకప్పుడు తన సినిమాలను చూసిన కూతురు నిర్మాతగా మారడం గర్వంగా ఉందని తెలిపారు.
- చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుస్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. సుస్మిత చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
సుస్మితపై చిరంజీవి ప్రేమ
Chiranjeevi Wish: మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక గొప్ప తండ్రి అని మరోసారి నిరూపించుకున్నారు. తన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదల పుట్టినరోజును పురస్కరించుకుని, ఆమె పట్ల తనకున్న ప్రేమనంతా కురిపిస్తూ ఒక అద్భుతమైన సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి తన పోస్ట్‌లో సుస్మిత ఎదుగుదల గురించి ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు తన వేలు పట్టుకుని నడిచిన చిన్నారి, ఈరోజు ఇంత బాధ్యతాయుతమైన స్త్రీగా ఎదగడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఒక తండ్రిగా తనకు అత్యంత గర్వకారణమైన విషయం గురించి ఇలా రాసుకొచ్చారు.
Read also- Aspirants Season 3 OTT : మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ… స్టోరీ అంతా ఐఏఎస్ ల చుట్టూనే
ఒకప్పుడు తన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసిన కూతురు, ఈరోజు తనే నిర్మాతగా మారి తనకు ఒక మెమరబుల్ బ్లాక్‌బస్టర్ అందించడం చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. సుస్మితను ఎంతో ఇష్టంగా ‘హనీ పాప’ అని పిలుస్తూ తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందేశంతో పాటు చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సుస్మిత చిన్నప్పటి అరుదైన ఫోటోలతో పాటు, ప్రస్తుతం ఆమె సాధించిన విజయాలను ప్రతిబింబించే చిత్రాలను ఆయన జత చేశారు. “నా వేలు పట్టుకుని నడిచిన చిన్నారి నుంచి, ఈరోజు ఒక బాధ్యతాయుతమైన మహిళగా ఎదిగిన నీ ప్రయాణం నాకు ఎంతో గర్వకారణం.” అంటూ రాసుకొచ్చారు.
కూతురి ఎదుగుదలపై గర్వంగా చిరు
Read also- Peddi Movie : రిలీజ్ కు ముందే రికార్డ్ బ్రేక్ చేసిన ‘పెద్ది’.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే సామి..!
మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. “తండ్రీకూతుళ్ల బాండింగ్ అంటే ఇదే” అని కొందరు, “హ్యాపీ బర్త్‌డే సుస్మిత” అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సుస్మిత ప్రస్తుతం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ హీరోగా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.
Happy Birthday my precious @sushkonidela ❤️
వైరల్ అవుతున్న ఫోటోలు
From the little girl who once held my finger and walked beside me, to the strong, graceful and responsible woman you are today.
One of the most special moments for me as a father was seeing you watching my films, now producing a film,… pic.twitter.com/Z8FwhsXUrQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2026
చిరంజీవి తన కుమార్తెపై చూపించిన ప్రేమ, అభిమానం అందరినీ ఆకట్టుకుంటుంది. తండ్రి కూతుళ్ల అనుబంధం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.


