
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ తిరుపతిలో విడుదలైంది.
- ట్రైలర్‌లో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది.
- నయనతార, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఏజెంట్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
- ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది, ప్రీమియర్లు 11 నుండే.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ విడుదలైంది. తిరుపతిలో జరిగిన ఈ వేడుకలో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
MSVPG ట్రైలర్ విడుదల: అంచనాలు ఆకాశాన్ని తాకాయి
MSVPG Trailer: టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi)క్రేజ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల కు కేవలం 8 రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పాటలు, టీజర్, పోస్టర్లు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇకపోతే తాజాగా చిత్ర బృందం బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. నేడు ఉదయం చిత్ర బృందం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అనంతరం తిరుపతిలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. ఆ తరువాత ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ ట్రైలర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ, ఫ్యామిలీ సన్నివేశాలను కలబోస్తూ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ వీడియో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చివరిలో వెంకటేష్ గ్రాండ్ ఎంట్రీ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ లో నయనతార, చిరంజీవి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమా పట్ల మరిన్ని అంచనాలను పెంచేయడమే కాకుండా ,సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ సినిమా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ట్రైలర్ హైలైట్స్: యాక్షన్, కామెడీ, వెంకటేష్ ఎంట్రీ
ఇక ఈ సినిమాలో చిరంజీవి నయనతారతో పాటు మరొక హీరోయిన్ కేథరిన్ కూడా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి రాఏజెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా, 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫై మెగా అభిమానులు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత అనుకున్న స్థాయిలో ఏ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు మరి శంకర్ వరప్రసాద్ గారు సినిమా అయినా మంచి సక్సెస్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి . ఇప్పటివరకు అనిల్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఏవి ప్రేక్షకులను నిరాశపరచలేదు దీంతో చిరు సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
సంక్రాంతి రేసులో ‘మన శంకర వరప్రసాద్ గారు’
మొత్తంగా, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ సినిమా పట్ల అంచనాలను మరింత పెంచింది. సంక్రాంతి పండుగకు ఇది పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.


