|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు సర్జరీ రహస్యం బట్టబయలు! ప్రమోషన్లకు ఎందుకు దూరమయ్యారో తెలుసా?

Published: 05-01-2026, 6:00 AM
చిరు సర్జరీ రహస్యం బట్టబయలు! ప్రమోషన్లకు ఎందుకు దూరమయ్యారో తెలుసా?
  • చిరంజీవి తన రాబోయే MSVPG సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు.
  • కాలికి జరిగిన సర్జరీ కారణంగానే ఆయన గైర్హాజరైనట్లు సమాచారం.
  • ఈ సర్జరీ విషయాన్ని ఆయన బృందం రహస్యంగా ఉంచింది.
  • ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరవుతారని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి MSVPG సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కాలికి సర్జరీ చేయించుకున్నారని, అందుకే ప్రమోషన్లకు రాలేకపోయారని ఇప్పుడు తెలుస్తోంది. ఈ విషయం రహస్యంగా ఉన్నప్పటికీ, ఆయన త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంటారని సమాచారం.

ప్రమోషన్లకు దూరంగా చిరంజీవి: అసలు కారణం ఇదే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకరా వరప్రసాద్ గారు(MSVPG) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) నయనతార (Nayanthara) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇక ఎప్పుడు ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార కూడా రంగంలోకి దిగి తనదైన శైలిలోనే ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఈ సినిమా ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో ఈవెంట్స్ జరిగిన చిరంజీవి ఏ కార్యక్రమానికి హాజరు కాలేదు దీంతో చిరంజీవి ఎందుకు ప్రమోషన్లకు దూరంగా ఉన్నారనే సందేహం అభిమానులలో కలుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవికి సర్జరీ కావటం వల్లే ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. గతంలో చిరంజీవి తీవ్రమైన మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో సర్జరీ చేయించుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

రహస్యంగా జరిగిన చిరంజీవి కాలి సర్జరీ వివరాలు

మరోసారి ఈయన తన కాలికి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ తన బాధను ఓర్చుకొని శంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ పూర్తి చేశారట .అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. అందుకని సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నారట. ఇక ఈ వారంలో ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవితో పాటు చిత్ర బృందం హాజరు కాబోతున్నారని అక్కడి నుంచి ఈయన పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నట్టు సమాచారం.

చిరంజీవి కాలికి సర్జరీ జరిగిన విషయాన్ని ఆయన టీమ్ రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుంది కచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా చిరు సినిమా నిలుస్తుంది అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాగా 11వ తేదీ ప్రీమియర్లను ప్రదర్శించనున్నారు.

MSVPG సినిమా రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్

చిరంజీవి సర్జరీ తర్వాత కూడా షూటింగ్ పూర్తి చేయడం అభినందనీయం. ఆయన త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించి అభిమానులను ఉత్సాహపరుస్తారని ఆశిస్తున్నారు. MSVPG సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలవాలని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.