|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరు-నాగ్‌తో మల్టీస్టారర్‌.. ఇలా మిస్‌ అయింది!

Published: 25-06-2025, 8:28 AM
చిరు-నాగ్‌తో మల్టీస్టారర్‌.. ఇలా మిస్‌ అయింది!

టాలీవుడ్‌లోని ప్రముఖ నటులు చిరంజీవి మరియు నాగార్జునలు మంచి స్నేహితులు. వీరిద్దరి కలిసి నటించే సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్పటివరకు అది జరగలేదు. ఎందుకు అంటే…?

Key Points

1

చిరంజీవి, నాగార్జునల మధ్య మంచి స్నేహం ఉంది.

2

ఇద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు.

4

సరైన కథ లేకపోవడమే ఇద్దరి కలయిక సినిమాకు అడ్డంకి.

చిరు-నాగ్ స్నేహం

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు చిరంజీవి( Chiranjeevi,), నాగార్జున(Nagarjuna) ఎంత మంచి స్నేహితులో అందరికి తెలిసిందే. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పండుగ సమయంలో లేదా ఏదైనా శుభకార్యం జరిగితే ఫ్యామిలీతో కలిసి హాజరవుతుంటారు. కెరీర్‌ పరంగానే కాకుండా వ్యాపార పరంగానూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అంతా క్లోజ్‌గా ఉండే ఈ ఇద్దరు..ఇప్పటి వరకు కలిసి నటించకపోవడం గమనార్హం. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వస్తే బాగుటుందని అటు అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు ఇటు మెగా అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

సినిమా ప్రయత్నాలు

అయితే గతంలోనే వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాల్సింది. కానీ చివరి నిమిషంలో అది ఆగిపోయిందట. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ..చిరు, నాగ్‌లతో ఓ సినిమా ప్లాన్‌ చేశాడట. వీరిద్దరికి ఉన్న స్టార్‌  ఇమేజ్‌ దృష్ట్యా.. భారీ బడ్జెట్‌తో సినిమాను తీయాలని భావించాడట. అయితే దానికి తగ్గట్టుగా కథ సెట్‌ కాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.

కథల సమస్య

ఆ తర్వాత కూడా పలువురు దర్శకుడు వీరిద్దరితో సినిమా చేసేందుకు ప్లాన్‌ చేశారు.అయితే సరైన కథ దొరకపోవడంతో చిరంజీవి, నాగార్జున ఇప్పటివరకు కలిసి నటించలేదు. ఆ మధ్య అనిల్‌ రావిపూడి కూడా వీరిద్దరితో కలిసి సినిమా చేస్తాడనే రూమర్‌ వినిపించింది. చిరంజీవితో తీయబోయే సినిమాలో నాగార్జున కూడా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఒట్టి పుకారే అని తేలిపోయింది. సరైన కథ రావాలే కానీ కలిసి నటించడానికి తాము రెడీ అని చిరు, నాగ్‌ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ మన దర్శక-రచయితలే వారిని మెప్పించే కథలను సిద్ధం చేయడం లేదు. మరి వారిద్దరు మెచ్చే కథ ఏ దర్శకుడు తీసుకొస్తాడో..అసలు చిరు-నాగ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందో రాదో చూడాలి.

చిరంజీవి, నాగార్జునల కలయిక కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సరైన కథ దొరికితేనే ఈ కల సాకారం అవుతుంది. మరి వారిద్దరి కలయికలో సినిమా వస్తుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.