
📌 Key Points
- జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్
- రెండు రోజుల్లో రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రం
- సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ సందడి
- చిరు, వెంకీ కాంబినేషన్ అదిరింది అంటూ నెటిజన్ల కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది.
బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు సినిమా
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.
సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో తారల మెరుపులు
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh0 గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది. అలా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఈ మూవీ రూ.120 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
దీంతో తాజాగా చిరంజీవి ఇంట్లో మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేశాడు. చిరు-వెంకీతో పాటు చరణ్ తీసుకున్న ఫొటో ఈ సెలబ్రేషన్స్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. త్రిస్టార్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్‌తో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిద్దాం.


