|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా పరిశ్రమకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్! ఇకపై సింగిల్ విండోలోనే అన్నీ!!

Published: 19-03-2026, 4:35 PM
సినిమా పరిశ్రమకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్! ఇకపై సింగిల్ విండోలోనే అన్నీ!!
  • తెలంగాణలో సినిమా నిర్మాణానికి సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి.
  • హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ లక్ష్యం.
  • నెట్‌ఫ్లిక్స్ జీసీసీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం హాలీవుడ్‌కు వచ్చినట్టేనన్న సీఎం.
  • సినిమా అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ప్రకటన.

తెలంగాణలో సినిమా నిర్మాణానికి ప్రభుత్వం ఒక సింగిల్ విండో విధానాన్ని తీసుకురానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలియజేస్తూ, సినిమా నిర్మాతల కోసం ఇకపై అనుమతులు సులభతరం అవుతాయని అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినిమా కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు.

సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

CM Revanth Reddy: ఎవరైనా సినిమా నిర్మించడానికి కథతో వస్తే, రీల్స్‌తో బయటకు వెళ్లడానికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించిందో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ‘ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఏ అకౌంట్‌బులిటి, ఐ హ్యావ్ ఎంకరేజ్ మై పీపుల్, ఐ హ్యావ్ టు ఐడింటిఫై టాలెంట్, ఐ హ్యావ్ టు స్పేస్ టు పెర్ఫార్మ్ థేమ్’. ఈ రోజు జపాన్, కొరియా.. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలు అభివృద్దిలో ఉన్నాయంటే అక్కడి ప్రభుత్వాల ప్రోత్సాహమే కారణం. ఈ రోజు సౌత్ కొరియా, ఫిల్మ్ ఇండస్ట్రీని లీడ్ చేస్తోంది. అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తరపున సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించి.. జపాన్, కొరియా, యుఎస్‌లలో ఉండే ఇండస్ట్రీని హైదరాబాద్‌కు ఆహ్వానించి, ఇక్కడి నుంచే ప్రోత్సహించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ జీసీసీ సెంటర్

బ్లాక్ అండ్ వైట్ మూవీ, టెక్నో కలర్స్, ఈస్ట్‌మన్ కలర్, 70 ఎమ్ఎమ్, ఐమాక్స్, డాల్బీ.. ఇలా ఎన్నో రకాల సాంకేతిక పరమైన అభివృద్ధిని హైదరాబాద్ నగరం ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ ఐలైన్‌ని ప్రారంభించుకున్నాం. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చింది.. వారి జీసీసీ సెంటర్‌ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే, హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్టే. ఈ రోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ నగరం నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి, ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులు ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది.

సింగిల్ విండో విధానంతో సులభతర అనుమతులు

ఎవరైనా సినిమా నిర్మించడానికి కథతో వస్తే, రీల్స్‌తో బయటకు వెళ్లడానికి ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీ వంటి సంస్థలు ఇక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని ఈ వేదికగా ఉపముఖ్యమంత్రి వర్యులకు నేను సూచన చేస్తున్నా. మమ్మల్ని ఎవరూ వచ్చి కలిసి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఒక ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేశాం. అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది. ఇప్పుడంతా ఏఐ పైనే ఆధారపడుతున్నాం. ఎవరూ మా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్లోబల్ డెస్టినీ అవ్వాలనేదే నా యాంబిషన్. అందుకే ఈ రోజు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ని అందిస్తున్నాం’’ అని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందని, సింగిల్ విండో విధానం ద్వారా మరింత సులభంగా అనుమతులు పొందవచ్చని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది పరిశ్రమకు ఒక గొప్ప ప్రోత్సాహం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.