📌 Key Points
- ధాన్యం, మొక్కజొన్న సేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశం.
- ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి, కొనుగోళ్లను పర్యవేక్షించాలని సూచన.
- గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం.
- నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడొద్దని సీఎం హెచ్చరిక.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యం, మొక్కజొన్న సేకరణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించి, కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్లకు పూర్తి బాధ్యత అప్పగించారు.
ధాన్యం సేకరణ: సీఎం ఆదేశాలు
Paddy Procurement in Telangana : అన్నదాతల నుంచి ధాన్యం, మొక్కజొన్న సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కొనుగోళ్ల పురోగతిని సమీక్షించారు. ధాన్యం సేకరణను ఒక ‘మిషన్ మోడ్’లో తీసుకోవాలని…… క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు.
కలెక్టర్లకు పూర్తి బాధ్యత
గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించాలన్నారు. ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకూ వెనకాడొద్దన్నారు.
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం సేకరణలో పారదర్శకత, వేగం పెంచడం ద్వారా అన్నదాతలకు భరోసా కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.


