
📌 Key Points
- జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌కు ఎదురైన భాషా సమస్యను AI పరిష్కరించింది.
- హోటల్ గదిలో ఏసీ రిమోట్ జపనీస్ భాషలో ఉండటంతో టూరిస్ట్ ఇబ్బంది పడ్డాడు.
- గూగుల్ AI ‘నానో బనానా’ సాయంతో రిమోట్‌ను ఇంగ్లీషులోకి మార్చుకున్నాడు.
- ట్రావెలర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది.
విదేశీ ప్రయాణాల్లో భాషా సమస్యలు సర్వసాధారణం. అయితే, జపాన్‌లో ఒక టూరిస్ట్ తన ఏసీ రిమోట్ సమస్యను AI సాయంతో పరిష్కరించుకున్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో AI టెక్నాలజీ ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది.
జపాన్‌లో టూరిస్ట్‌కు ఎదురైన సవాల్
విదేశీ ప్రయాణాల్లో భాషా సమస్యలు ఎదురైనప్పుడు AI ఏ విధంగా అండగా నిలుస్తుందో నిరూపించే ఒక ఆసక్తికర ఘటన జపాన్‌లో వెలుగుచూసింది. ఒక అమెరికన్ టూరిస్ట్ జపాన్ పర్యటనలో ఎదుర్కొన్న ఇబ్బందిని AI సాయంతో చిటికెలో పరిష్కరించుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జపాన్‌కు వెళ్లిన ఓ అమెరికన్ టూరిస్ట్ ఒక హోటల్ గదిలో బస చేశాడు. తెల్లవారుజామున గదిలో విపరీతమైన ఉక్కపోతగా అనిపించడంతో నిద్రలేచి, ఏసీ టెంపరేచర్ తగ్గించాలని రిమోట్ చూసి అవాక్కయ్యాడు. ఆ రిమోట్ పైన ఉన్న బటన్లన్నీ జపనీస్ భాషలో ఉన్నాయి. జపనీస్ భాష తెలియకపోవడంతో ఏ బటన్ దేనికి పని చేస్తుందో అర్థంకాక, ఆ సమయంలో ఎవరిని అడగాలో తెలియక, చివరికి గూగుల్ AI “నానో బనానా ” సాయం కోరాడు. రిమోట్‌ను స్కాన్ చేసి, ఆ ఫొటోను AIకి పంపి, కేవలం జపనీస్ అక్షరాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవ్వమని కోరాడు. AI ఆ ఫొటోను విశ్లేషించి, రిమోట్‌లోని టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్స్, టైమర్ బటన్లను యూజర్ కోరినట్టు జపనీస్ నుంచి ఇంగ్లీష్ భాషలోకి మార్చిన రిమోట్ ఇమేజ్‌ను క్షణాల్లో రూపొందించి ఇచ్చింది. ఆ ఫొటో ఆధారంగా ఏసీ సెట్టింగ్‌లను సులభంగా అడ్జస్ట్ చేసుకొని, ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు తన అనుభవాన్ని ఆ ట్రావెలర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్ల నుండి విశేష స్పందన లభిస్తోంది.
AIతో సమస్యను పరిష్కరించిన టూరిస్ట్
వైరల్ అవుతున్న టూరిస్ట్ అనుభవం
ఈ సంఘటన AI టెక్నాలజీ యొక్క శక్తిని, ప్రపంచవ్యాప్తంగా భాషా సమస్యలను పరిష్కరించడంలో దాని పాత్రను తెలియజేస్తుంది. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ.


