|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేరళ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సంచలనం! సీఎంకు సవాల్, యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల!

Published: 02-04-2026, 2:35 AM
కేరళ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సంచలనం! సీఎంకు సవాల్, యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల!
  • కేరళంలో యూడీఎఫ్ మేనిఫెస్టోను రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
  • తెలంగాణలో అమలవుతున్న పథకాలను పరిశీలించాలని కేరళ సీఎంకు సవాల్ విసిరారు.
  • యూడీఎఫ్ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థినులకు ఆర్థిక సాయం వంటి హామీలు ఉన్నాయి.
  • ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, నిరుద్యోగులకు జాబ్ వాచ్ టవర్ ఏర్పాటు చేస్తామని యూడీఎఫ్ ప్రకటించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిశీలించాలని ఆయనకు సవాల్ విసిరారు.

యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి, కేరళలో విజయన్‍కు పెద్ద తేడా లేదని, పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్, ఇటు కేరళను విజయన్ భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిచారు. 2023 డిసెంబర్‍లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని, ఈ నెలలో కేరళలో కూడా పదేళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. కేరళం పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ తన రెండోరోజు పర్యటనలో భాగంగా ఇవాళ కొచ్చిన్‍లో యూడీఎఫ్ (UDF) కూటమి మేనిఫెస్టోను స్థానిక నేతలతో కలిసి విడుదల చేశారు. మొత్తం ఐదు గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను రూపొందిచారు. ఈ సందర్భంగా కేరళం సీఎంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.

కేరళ సీఎంకు రేవంత్ రెడ్డి సవాల్

ఈ సందర్భంగా కేరళం సీఎం పినరయి విజయన్‍కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజాపాలన నడుస్తోంది మా రాష్ట్రానిక వచ్చి ఆరు గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో వచ్చి చూడాలని చాలెంజ్ చేశారు. తెలంగాణలో మేము పాలకులుగా కాకుండా సేవకులంగా పని చేస్తున్నామని ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో 67,173 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. రైతుల రుణాల మాఫీ చేశామన్నారు. రైతు భరోసాకు రూ. 18 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రజల జీవితాలను చూసిన అనుభవం ఉందన్నారు. కేళం మరో తెలంగాణ కాబోతోందన్నారు.

యూడీఎఫ్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

‘కేరళ గెలుస్తుంది – యూడీఎఫ్ నడిపిస్తుంది’ అనే నినాదంతో ‘ఇందిర గ్యారెంటీ’ పేరుతో పలు ఆకర్షణీయమైన పథకాలను తమ ఎన్నికల హామీలుగా యూడీఎఫ్ ప్రకటించింది.మహిళా సంక్షేమం కింద కేఎస్ఆర్‌టీసీ (KSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కళాశాల విద్యార్థినులకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. సామాజిక పెన్షన్ పథకం కింద సంక్షేమ పెన్షన్లను రూ.3,000 కు పెంపు, మాజీ ముఖ్యమంత్రి ఉమ్మన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా కల్పించనున్నట్లు తెలిపారు. వ్యాపారాలు ప్రారంభించే యువతకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. నిరుద్యోగుల కోసం ‘జాబ్ వాచ్ టవర్’, యువశ్రీ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ పొందడం ప్రాథమిక హక్కుగా (ఎవరూ నేలపై పడుకోవాల్సిన అవసరం ఉండదు) మారుస్తామని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి కేరళ పర్యటన, యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన సవాల్, ఇచ్చిన హామీలు రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.