|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెళ్లైన మరుక్షణమే విషాదం! నవ వధువు, వరుడిని కబళించిన మృత్యువు!

Published: 13-04-2026, 7:35 AM
పెళ్లైన మరుక్షణమే విషాదం! నవ వధువు, వరుడిని కబళించిన మృత్యువు!
  • మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో పెళ్లి జరిగిన మరుసటి రోజే నలుగురు మృతి చెందారు.
  • వీరేంద్ర, రాజేశ్వరి దంపతులు, వరుడి తల్లి, వదిన ఆటో ప్రమాదంలో దుర్మరణం చెందారు.
  • కోళ్ల దాణా బస్తాలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోపై బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
  • సమీపంలోని సీసీటీవీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో పెళ్లైన మరుసటి రోజే ఒక విషాదకర సంఘటన జరిగింది. నూతనంగా వివాహమైన జంటతో పాటు వారి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివాహ వేడుకలో విషాదం

విధి పగసాధించిందా అన్నట్లుగా ఓ జంటను కాళ్ల పారాణి ఆరకముందే ఊహించని రీతిలో మృత్యువు కబలించింది. పెళ్లైన మరుసటి రోజే వధూవరులు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అందరిని కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఈ విషాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరేంద్ర శాక్య (25) అనే యువకుడికి రాజేశ్వరి అనే యువతితో శనివారం ఒక ఆలయంలో ఘనంగా వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట గుడిలో పూజలు ముగించుకుని గత ఆదివారం వరుడి తల్లి అన్వేష్ శాక్య (50), వదిన రాజో శాక్య (22) సోదరి భూరియా శాక్యతో కలిసి ఆటోలో తమ స్వగ్రామానికి బయలుదేరారు.

మార్గమధ్యలో ఆటో డ్రైవర్ ఓ క్రాస్ రోడ్డు వద్ద పక్కన ఆటోను ఆపి దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో కోళ్ల దాణా బస్తాలతో ఓ లారీ ఆటో ఉన్న వైపు టర్న్ అయేందుకు ప్రయత్నించింది. అక్కడ కాస్త డౌన్ ఉండటంతో భారీ లోడ్ తో ఉన్న లారీ అదుపుతప్పి ఆటోపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు కాగా ఆటోలో కూర్చున్న వధువు, వరుడు, వారి కుటుంబ సభ్యులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వరుడి సోదరి భూరియా శాక్య, ఆటో డ్రైవర్ డ్రైవర్ ఆ సమయంలో బయట ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పెళ్లి బాజాలు మోగిన ఇంట్లో చావు డప్పులు వినిపించడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల రోధనలతో ఆ గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

లారీ బీభత్సం: నలుగురు దుర్మరణం

సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

ఈ దుర్ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లింట చావు డప్పులు మోగడంతో ఆ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.