|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?

Published: 13-05-2026, 5:31 AM
CM Vijay Salary: హీరోగా 275 కోట్లు.. మరి సీఎంగా దళపతి జీతం ఎంతో తెలుసా?

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి.. సీఎం అయ్యాడు సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి. తమిళనాట పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ.. 108 సీట్లు సాధించి.. అతి పెద్ద పార్టీగా టీవీకే అవతరించింది.  అన్ని సర్వేలు డీఎంకే గెలుస్తుందని చెప్పినా, వాటన్నింటినీ తలకిందులు చేస్తూ విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది.  ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.

తొలి ఎన్నికల్లో ఎంజీఆర్ సాధించిన ఓట్ల శాతం కన్నా విజయ్ ఎక్కువ ఓట్లు సాధించారు. అయితే, మెజారిటీకి మరో 11 సీట్లు అవసరం కావడంతో కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీల సపోర్టుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మే 10న చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక కూడా జరిగింది.

విజయ్ దళపతి  పార్టీ పెట్టినప్పటి నుంచి చాలామంది, ఆయన సినిమాల్లో భారీ రెమ్యునరేషన్ ను వదులుకుని  ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నారని అన్నారు. నిజానికి, నటుడిగా తన చివరి సినిమాకు విజయ్ రూ.275 కోట్లు పారితోషికం తీసుకున్నారు. తమిళ సినీ చరిత్రలో ఏ నటుడూ ఇంత పెద్ద మొత్తంలో తీసుకోలేదు. ఇంత డబ్బును వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్, సీఎంగా ఎంత జీతం తీసుకుంటారన్న ఆసక్తి అభిమానులతో పాటు  అందరిలో ఉంది.

ముఖ్యమంత్రిగా విజయ్ నెలకు రూ.2.05 లక్షల జీతం అందుతుంది. ఇతర అలవెన్సులతో కలిపి నెలకు మొత్తం రూ.2.85 లక్షలు వస్తాయని సమాచారం. అంటే, ఏడాదికి ఆయన జీతం రూ.34.2 లక్షలు. సినిమాల్లో ఆయన సంపాదనతో పోలిస్తే, ఇది ఆయన ఒక్కరోజు సంపాదన కన్నా కూడా తక్కువే. అయితే విజయ్ సినిమాలకు గుడ్ బై చెపుతారా? లేక కొంత కాలం తరువాత కంటీన్యూ చేస్తారా అన్న విషయంలో క్లారిటీ లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండి ఎన్టీఆర్ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి 50 ఏళ్ల విజయ్ ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.