
📌 Key Points
- దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ‘కాక్రోచ్’ పేరుతో సినిమా రూపొందించారు.
- ఈ చిత్రం మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథతో తెరకెక్కింది.
- శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు ఈ సినిమాను నిర్మించారు.
- సున్నిత మనస్కులు, పిల్లలు ఈ సినిమా చూడొద్దని మేకర్స్ తెలిపారు.
రాజమౌళి ‘ఈగ’ సినిమా తర్వాత, పి. సునీల్ కుమార్ రెడ్డి ‘కాక్రోచ్’ అనే సినిమాతో వస్తున్నారు. ఇది మురికి కూపంలో ప్రేమకథ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది.
‘కాక్రోచ్’ సినిమా వివరాలు
Cockroach: దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ‘ఈగ’ (Eega)ను పెట్టి సినిమా తీసి సక్సెస్ కొట్టారు. అప్పటి నుంచి దోమని పెట్టి సినిమా తీయండి అంటూ సరదాగా కామెంట్స్ పడుతుంటాయ్. కానీ ఇప్పుడో దర్శకుడు ఏకంగా ‘బొద్దింక’ పేరుతో సినిమా చేశారు. అయితే ఇదేదో రాజమౌళి తరహాలో కేవలం ఈగని బేస్ చేసుకుని తీసిన సినిమా కాదని తెలుస్తోంది. సమాజం చీత్కరించుకొనే మురికి మనుషుల మధ్య నడిచే అందమైన ప్రేమ కథతో ‘కాక్రోచ్’ అనే టైటిల్‌తో పి. సునీల్ కుమార్ రెడ్డి (P Sunil Kumar Reddy) సినిమా చేశారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ శనివారం అధికారికంగా తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
సినిమా చూడొద్దని మేకర్స్ ప్రకటన
విడుదలకు సిద్ధం.. అడ్డురోడ్‌లో పడుపు వృత్తి చేసుకొనే వేశ్యకి, ఒక కిరాయి హంతకుడికి మధ్య సాగే స్వచ్ఛమైన స్నేహమే ‘కాక్రోచ్’ (Cockroach) అని అంటున్నారు చిత్ర బృందం. భ్రష్టు పట్టిన అవినీతి సమాజపు చీకటిని పరిచయం చేసే చిక్కటి చిత్రమని, కాక్రోచ్‌ని చంపితే చప్పట్లు కొడుతూ, సీతాకోక చిలుకలపై కవితలు రాసే ద్వంద విలువల మనస్తత్వాలని ప్రశ్నించే పాత్రలతో దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి. బాపిరాజు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో..
నటీనటులు, సాంకేతిక నిపుణులు
సున్నిత మనస్కులు, పిల్లలు ఈ సినిమా చూడొద్దు మా ‘కాక్రోచ్’ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. సున్నిత మనస్కులు, పిల్లలు ఈ చిత్రానికి దూరంగా ఉండాలని దర్శక నిర్మాతలు సవినయంగా పత్రికాముఖంగా కోరారు. చిత్రాన్ని మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వారు ఈ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలో ఉన్న హింసాత్మక పోరాటాలను సహజంగా చూపించడానికి రియల్ ఫైటర్స్‌ని నటులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్‌లు నిజజీవిత ఆధారిత కిరాయి హంతకులుగా నటించగా.. ‘సొంతవూరు’ చిత్రంలో ఉత్తమ నటి అవార్డు గ్రహీత ‘తీర్థ’ ఒక ముఖ్య పాత్ర ఇందులో పోషించారు. మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేష్ వంటివారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు. మరి రాజమౌళికి ‘ఈగ’ హిట్ ఇచ్చినట్లుగా పి. సునీల్ కుమార్ రెడ్డికి ఈ ‘బొద్దింక’ హిట్ ఇస్తుందో, లేదో తెలియాలంటే మాత్రం మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే.
మొత్తానికి, పి. సునీల్ కుమార్ రెడ్డి ‘కాక్రోచ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. త్వరలో టీజర్ విడుదల కానుంది.


