|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రంభ ఇంట్లో పెను విషాదం: తండ్రి మరణం.. ‘నా ప్రపంచం శూన్యం’ అంటూ కన్నీటి పోస్ట్!

Published: 25-05-2026, 4:46 PM
రంభ ఇంట్లో పెను విషాదం: తండ్రి మరణం.. 'నా ప్రపంచం శూన్యం' అంటూ కన్నీటి పోస్ట్!
  • అలనాటి నటి రంభ తండ్రి వెంకటేశ్వరరావు మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
  • ‘నా ప్రపంచం శూన్యమైంది’ అంటూ రంభ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.
  • రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి కాగా, 1992లో మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.
  • ఆ తర్వాత అదే ఏడాది ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగారు.

ఒకప్పటి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ రంభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ‘నా ప్రపంచం శూన్యమైంది’ అంటూ రంభ సోషల్ మీడియాలో పెట్టిన భావోద్వేగ పోస్ట్ వైరల్ అవుతోంది.

రంభ ఇంట విషాదం: తండ్రి మృతి

Rambha : రంభ…తనదైన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారుని ఈ అమ్మడు ఎలా షేక్ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా అలనాటి ఈ వెటరన్ హీరోయిన్ ఇంట్లో ఇపుడు తీవ్ర విషాదం నెలకొంది. అవును..తన తండ్రి వెంకటేశ్వరరావు ఈరోజు చనిపోయినట్టు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అఫీషియల్ వెల్లడిస్తూ ఎమోషనల్ అయిపొయింది.

నా హృదయంలో నీ స్థానాన్ని బ్రతికున్నంత కాలం ఎవరూ భర్తీ చేయలేరంటూ, జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ముఖంపై చిరునవ్వును మాత్రం ఎప్పుడూ చెరిగిపోనివ్వలేదని తండ్రిని గుర్తుచేసుకుంది రంభ ఆయన భౌతికంగా దూరమవడంతో తన ప్రపంచమంతా శూన్యమైపోయిందంటూ రంభ పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ విషాదకరమైన వార్త తెలీడంతో టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు రంభకు  సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

‘సర్గామ్’ అనే మలయాళ చిత్రంతో ఎంట్రీ

ఇక రంభ విషయానికి వస్తే ఆమె ఇండస్ట్రీలోకి రాకముందు పేరు యూది విజయలక్ష్మి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన పక్కా తెలుగమ్మాయి అయినప్పటికీ, ఈమెకు ఫస్ట్ ఛాన్స్ మాత్రం మాలీవుడ్ నుంచి రావడం గమనార్హం. 1992వ సంవత్సరంలో హరిహరన్ దర్శకత్వంలో వచ్చిన ‘సర్గామ్’ అనే మలయాళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. శాస్త్రీయ సంగీతం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డ్ కొట్టడం విశేషం.

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి

సోషల్ మీడియాలో రంభ ఎమోషనల్ పోస్ట్

ఇక ఈ సక్సెస్ ఇచ్చిన ఊపులో అదే ఏడాది అంటే 1992 చివరలో ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సంచలన విజయం సాధించింది.ఇక ఈ సినిమా ప్రొడక్షన్ సమయంలోనే ఆమె పేరును విజయలక్ష్మి నుంచి రంభగా మార్చారు. ఆ పేరు ఎంతగా కలిసివచ్చిందంటే, ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రానంతగా.

ఇక మొదటి సినిమాతోనే సత్తా చాటిన రంభ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లింది. టాలీవుడ్ అగ్ర హీరోలైన సూపర్ స్టార్ కృష్ణతో ‘నంబర్ వన్’, మెగాస్టార్ చిరంజీవితో ‘హిట్లర్’, ‘బావగారూ బాగున్నారా’, నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘భైరవద్వీపం’, విక్టరీ వెంకటేష్‌తో ‘అబ్బాయిగారు’, ‘గణేష్’, కింగ్ నాగార్జునతో ‘బాంబే ప్రియుడు’ వంటి ఎన్నో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే పెళ్లి

రంభ సినీ ప్రస్థానం: మలయాళం టు టాలీవుడ్

ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె చేసిన గ్లామరస్ పాత్రలు 90S యూత్ ని షేక్ చేశాయ్.అయితే కేవలం గ్లామర్ కి ,మాత్రమే పరిమితం కాలేదండోయ్.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ అదరగొట్టింది. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ‘జుడ్వా’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో పాటు మలయాళం, కన్నడ, భోజ్‌పూరి, బెంగాలీ ఇలా ఏకంగా ఏడు భాషల్లో నటించి సంచలన స్ప్రుష్టించింది.

ఇక అలా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే, 2010 ఏప్రిల్ 8న కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాథన్‌ను తిరుమలలో ఘనంగా వివాహం చేసుకుని సినిమా రంగానికి గుడ్‌బై చెప్పేసింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు లాణ్య, సాషా మరియు ఒక కుమారుడు శివిన్ ఉన్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా కెనడాలోనే స్థిరపడిన రంభ, గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్నప్పటికీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే ఉంది.

తెలుగు, తమిళ భాషల్లో ప్రసారమయ్యే పలు పాపులర్ రియాలిటీ డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఆడియన్స్ కి టచ్‌లోనే ఉంటోంది.ఇక ఈ క్రమంలోనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాలని అనుకుంటున్న ఈ సమయంలో తండ్రి చనిపోవడం విషాదకరం.

రంభ తండ్రి మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులు రంభకు సంతాపం తెలుపుతున్నారు. ఈ కష్టకాలంలో ఆమెకు ధైర్యం చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.