
📌 Key Points
- పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ రఫిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- అనుదీప్ అనే మరో కమెడియన్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంతో వివాదం మొదలైంది.
- మెగా అభిమానులు కమెడియన్ల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- అనుదీప్ కు బెయిల్ లభించగా, రఫిక్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
పవన్ కళ్యాణ్ పై స్టాండప్ కమెడియన్ రఫిక్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో మచిలీపట్నం పోలీసులు రఫిక్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో అనుదీప్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. మెగా అభిమానులు కమెడియన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు
Standup comedian Rafiq: ఇటీవల కాలంలో కామెడీ పేరుతో కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది కమెడియన్స్ చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవల కాలంలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అనుదీప్(Anudeep) అనే కమెడియన్ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ఆయన విడాకుల గురించి మాట్లాడటమే కాకుండా నిహారిక, ఉపాసన, రాంచరణ్ గురించి కూడా మాట్లాడారు.
ఇలా అనుదీప్ చేసిన వ్యాఖ్యల పట్ల మెగా ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈయనపై చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు .ఈ నేపథ్యంలోనే పోలీసులు తనని అరెస్టు చేసినప్పటికీ మరొక కమెడియన్ రఫిక్ (Rafiq)సైతం పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాల గురించి అలాగే ఆయన వైవాహిక జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తనపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ అభిమానులు డిమాండ్ చేశారు.
పోలీసుల అదుపులో కమెడియన్ రఫిక్
ఈ క్రమంలోని నేడు మచిలీపట్నం పోలీసులు రఫిక్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన స్వస్థలం వైజాగ్ కావటం విశేషం. తన ఇంట్లో ఉన్నటువంటి రఫిక్ ను మచిలీపట్నం పోలీసులు నేడు అరెస్టు చేశారు. దీంతో ఇది కాస్త సంచలనగా మారింది. అయితే అనూహ్యంగా నేడు అనుదీప్ జైలు నుంచి బయటకు రావటం గమనార్హం. పదివేల రూపాయల పూచికత్తుతో కోర్ట్ అనుదీప్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇలా అనుదీప్ జైలు నుంచి బయటకు రాగా రఫిక్ జైలుకు వెళ్లడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారా?
మెగా అభిమానుల ఆగ్రహం, చర్యలకు డిమాండ్
ఇలా స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారంపై నెటిజన్ లు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి స్టాండప్ కమెడియన్స్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇలా పవన్ ను టార్గెట్ చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది? ఎవరి ప్రోత్బలంతోనైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటూ మెగా అభిమానులు జనసైనికులు ఈ వ్యవహార శైలిపై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా జరుగుతుందా అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
స్టాండప్ కమెడియన్ల వ్యాఖ్యలు దుమారం రేపడంతో, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం వెనుక ఎవరి ప్రోత్బలం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


