
📌 Key Points
- యోగిబాబు ‘మూన్ వాక్’ మూవీలో ఏకంగా 16 విభిన్న పాత్రల్లో నటిస్తుండటం సంచలనం!
- ప్రభుదేవాతో కలిసి యోగిబాబు చేస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం!
- దాదాపు 25 ఏళ్ల తర్వాత ప్రభుదేవా సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయడం హాట్ టాపిక్!
- సమ్మర్ లో విడుదల కానున్న ఈ సినిమా యోగిబాబు కెరీర్ లో మైలురాయి అవుతుందా చూడాలి!
టాలీవుడ్ లో ఒక సంచలనం! కమెడియన్ యోగిబాబు ఏకంగా 16 పాత్రల్లో నటించి రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. ‘మూన్ వాక్’ మూవీతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉండండి!
16 పాత్రల్లో యోగిబాబు సంచలనం!
ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం వంటి ప్రయోగాలు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఉన్నాయి. హీరోలు ఇలాంటి పాత్రలు చేయడం సర్వసాధారణం. ఒకే సినిమాలో హీరో అనేక పాత్రలు పోషించడం చాలా అరుదైన విషయం. ఈ విషయంలో కాస్త ముందడుగు వేశాడు కమల్ హాసన్, ఆయన నటించిన ‘దశావతారం’ చిత్రం ఈ విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఆ సినిమాలో ఆయన పది పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి లాంటి స్టార్ హీరోలు త్రిపాత్రాభినయం చేసి మెప్పించగా.. అంతకుముందు తొమ్మిది పాత్రల్లో నటించిన హీరోలుగా శివాజీ గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తాయి.
ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో ‘మూన్ వాక్’ మూవీ!
ఇక కమల్ హాసన్ దశావతారం సనిమా తరువాత ఎవరు ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. మధ్య లో విక్రమ్ ట్రై చేసినా..అది సక్సెస్ అవ్వలేదు. ఇక తాజాగా కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగిబాబు మరోసారి ఈ ట్రెండ్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మూన్ వాక్’లో ఏకంగా 16 పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా యోగిబాబు ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే ఈ సినిమా ‘దశావతారం’ తరహాలో ఉండదని ఆయన స్పష్టం చేశారు. మొదట్లో ఈ స్థాయిలో పాత్రలు చేయడానికి తాను నిరాకరించానని, కానీ దర్శకుడు పట్టుదలతో ఒప్పించడంతో ఈ ప్రయోగానికి అంగీకరించినట్లు తెలిపారు.
‘మూన్ వాక్’ సినిమాలో ప్రభుదేవా హీరోగా నటిస్తుండగా.. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విశేషం ఏంటంటే.. దాదాపు 25 ఏళ్ల తరువాత ప్రభుదేవ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ చేయబోతున్నారు. .ఈ సినిమాలో యోగిబాబు పలు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. దుబాయ్ మాథ్యూ, కవారిమాన్ నారాయణన్, ఆట్టుక్కాల్ వంటి పాత్రలను ఆయన పోషిస్తున్నారు. ఈ 16 పాత్రలు ఒకదానికి ఒకటి సంబధం లేకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
సమ్మర్ లో రిలీజ్.. రికార్డులు బ్రేక్ అవుతాయా?
ఒక చిన్న పట్టణంలో నివసించే కొంతమంది యువకులు పాప్ సంగీతం, ముఖ్యంగా మైఖేల్ జాక్సన్ ప్రభావంతో డ్యాన్స్ నేర్చుకోవాలని ఆశపడతారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి వారు చేసే ప్రయత్నాలు, ఎదురయ్యే సవాళ్లు, చివరకు వారి కల నెరవేరుతుందా లేదా అన్నదే కథగా తెలుస్తోంది.ఈ సినిమా ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగిబాబుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి.. ఈ సినిమాలో ఇన్ని పాత్రలు చేయించడం వెనుక కారణం ఏంటీ అనేది సినిమా చూసిన తరువాతే ఆడియన్స్ కు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ సినీ వర్గాల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.
యోగిబాబు ‘మూన్ వాక్’ మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


