|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

IPL 2026: దుమ్మురేపిన CSK.. ఢిల్లీపై అదిరిపోయే విజయం!

Published: 11-04-2026, 3:05 PM
IPL 2026: దుమ్మురేపిన CSK.. ఢిల్లీపై అదిరిపోయే విజయం!
  • CSK జట్టు IPL 2026 సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో CSK 212 పరుగులు చేసింది.
  • సంజు శాంసన్ సెంచరీతో రాణించగా, ఢిల్లీ బ్యాటర్లు విఫలమయ్యారు.
  • చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ 189 పరుగులకే ఆలౌటైంది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. సంజు శాంసన్ సెంచరీతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.

CSK తొలి విజయం: ఐపీఎల్ 2026

IPL 2026 సీజన్లో CSK ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన CSK.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (115*) సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ ఐపీఎల్‌లో నమోదైన తొలి శతకం ఇదే కావడం విశేషం. ఆయుష్‌ మాత్రే (59), శివమ్ దూబె (20*) పరుగులు చేశారు. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (60), నిశాంక (41) మాత్రమే రాణించారు. మిగిలిన వారంతా పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో జెమీ ఓవర్టన్‌ 4, అన్షుల్‌ కాంబోజ్‌ 3 వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌, గుర్జన్‌ప్రీత్‌ సింగ్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్ తీసుకున్నారు. కాగా వరుస అపజయాలు వెంటాడున్న వేళ చెన్నై ఇ సూపర్ విక్టరీని నమోదు చేయడం జట్టుకు ధైర్యాన్నిచ్చింది.

సంజు శాంసన్ మెరుపు సెంచరీ

ఢిల్లీ బ్యాటింగ్ వైఫల్యం

మొత్తానికి, వరుస ఓటముల తర్వాత సీఎస్కే ఈ విజయం సాధించడం ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. రాబోయే మ్యాచులలో కూడా ఇదే జోరును కొనసాగిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.