
📌 Key Points
- గువాహటిలో రాజస్థాన్ రాయల్స్(RR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య మ్యాచ్.
- ఈ సీజన్‌లో రెండు జట్లు ఇంకా ఓటమి చవి చూడలేదు.
- పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు 3వ స్థానంలో ఉంది.
- IPL చరిత్రలో RCB 17 సార్లు, RR 14 సార్లు గెలుపొందాయి.
ఐపీఎల్ లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు కూడా ఈ సీజన్ లో ఇంకా ఓటమి ఎరుగవు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓటమి పాలవుతుందో చూడాలి.
నేడు RR vs RCB పోరు
IPL లో భాగంగా నేడు డిఫెండింగ్ ఛాంపియన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR), బెంగుళూరు రాయల్ చాలెంజర్స్(RCB) జట్ల మధ్య సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుత సీజన్లో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కుడా నమోదు చేయలేదు. నేడు జరగబోయే మ్యాచులోనే తొలి ఓటమి రుచి చూడబోతున్నాయి. రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండగా.. RCB రెండు విజయాలతో టేబుల్ లో 3వ స్దానంలో ఉంది. కాగా IPL చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 31 మ్యాచుల్లో తలపడగా.. RCB 17 సార్లు, RR 14 సార్లు విజయం సాధించాయి. కాగా నేటి మ్యాచుకు వర్షం అంతరాయం లేదని సమాచారం. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ లోనూ సమానంగా ఉన్న ఈ రెండు జట్లలో గెలిచేది ఎవరో సాయంత్రం తేలనుంది.
తుది ఫలితం ఎలా ఉండబోతుంది?
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
రెండు జట్లు బలంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.


