|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దళపతి విజయ్ జన నాయగన్ ట్రైలర్ కుదిపేసిన ఏఐ లోగో! 400 కోట్ల సినిమాపై ఫ్యాన్స్ ఆగ్రహం, రీమేక్ కు అవసరమా అంటూ సెటైర్లు

Published: 04-01-2026, 2:00 AM
దళపతి విజయ్ జన నాయగన్ ట్రైలర్ కుదిపేసిన ఏఐ లోగో! 400 కోట్ల సినిమాపై ఫ్యాన్స్ ఆగ్రహం, రీమేక్ కు అవసరమా అంటూ సెటైర్లు
  • దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ ట్రైలర్‌లో జెమినీ ఏఐ వాటర్‌మార్క్ కనిపించింది.
  • రూ. 400 కోట్ల బడ్జెట్ సినిమాలో ఈ ‘సిల్లీ మిస్టేక్’ పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  • ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే ఏఐ లోగో ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి కొత్త వెర్షన్ అప్‌లోడ్ చేశారు.
  • “ఒక రీమేక్ సినిమాకు కూడా ఏఐ వాడాలా?” అని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

దళపతి విజయ్ ‘జన నాయగన్’ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రూ. 400 కోట్ల బడ్జెట్ చిత్రంలో జెమినీ ఏఐ లోగో కనిపించడంపై నెటిజన్లు, ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సినిమా యూనిట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

జన నాయగన్ ట్రైలర్లో ఏఐ లోగో వివాదం

దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ ట్రైలర్‌లో జెమినీ ఏఐ వాటర్‌మార్క్ కనిపించడం సోషల్ మీడియాలో కలకలం రేపింది. రూ. 400 కోట్ల బడ్జెట్ సినిమాలో ఈ సిల్లీ మిస్టేక్ ఏంటీ అంటూ నెటిజన్లు ఎకిరీ పారేస్తున్నారు. ఇలా ఏఐ వాడటం పెద్ద అవమానం అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ వెండితెరకు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి జన నాయగన్ ట్రైలర్‌ను శనివారం (జనవరి 3) విడుదల చేశారు మేకర్స్.

శనివారం విడుదలైన జన నాయగన్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌లో ఒక చిన్న ‘ఏఐ’ (AI) పొరపాటు దొర్లడం ఇప్పుడు చిత్ర యూనిట్‌ను ఇరకాటంలో పడేసింది.

రూ. 400 కోట్ల చిత్రంలో సిల్లీ మిస్టేక్: అభిమానుల ఆవేదన

ట్విట్టర్ (X) లో దీనికి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌లు వైరల్ కావడంతో జన నాయగన్ మూవీ టీం అప్రమత్తమైంది. ఆదివారం (జనవరి 4) ఉదయం నాటికి జన నాయగన్ ట్రైలర్ నుంచి ఆ లోగో ఉన్న భాగాన్ని ఎడిట్ చేసి కొత్త వెర్షన్‌ను అప్‌లోడ్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

“ఒక రీమేక్ సినిమాకు కూడా ఏఐ వాడాలా?” అని మరొకరు సెటైర్లు వేయగా, “ఇది విజయ్ గారి ఆఖరి సినిమా.. కనీసం ఎడిటింగ్‌లోనైనా జాగ్రత్తలు తీసుకోవాలి కదా” అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే జన నాయగన్ సినిమాలో విజయ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. హీరోయిన్స్ పూజా హెగ్డే , మమితా బైజు, ప్రియమణి, బాబీ డియోల్ , ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం జన నాయగన్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

వెంటనే దిద్దుబాటు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం

దళపతి విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ను స్థాపించి 2026 ఎన్నికల బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా అభివర్ణిస్తున్నారు.

ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఏదేమైనా, జన నాయగన్ ఏఐ వివాదం సినిమాపై హైప్‌ను పెంచుతుందో లేక డ్యామేజ్ చేస్తుందో చూడాలి.

ఏదేమైనా, జన నాయగన్ ఏఐ వివాదం సినిమాపై హైప్‌ను పెంచుతుందో లేక డ్యామేజ్ చేస్తుందో చూడాలి. విజయ్ చివరి సినిమాకు ఇలాంటి పొరపాటు తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదం చిత్రం విడుదల వరకు కొనసాగే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.