|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాస్టింగ్ కౌచ్‌పై మరోసారి స్పందించిన దంగల్ నటి ఫాతిమా సనా షేక్

Published: 13-06-2025, 6:09 AM
కాస్టింగ్ కౌచ్‌పై మరోసారి స్పందించిన దంగల్ నటి ఫాతిమా సనా షేక్

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఈ విషయంపై ఆమె మరోసారి స్పందించింది.

Key Points

1

దంగల్ నటి ఫాతిమా సనా షేక్ కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడారు.

2

ఆమె వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పింది.

4

మలయాళ సినిమాల్లో నటించాలనే ఆమె కోరికను వెల్లడించింది.

ఫాతిమా సనా షేక్ యొక్క సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్(Fatima Sana Sheikh) ‘చాచీ’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమిర్ ఖాన్(Aamir Khan) ‘దంగల్’ మూవీతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ‘మెట్రో ఇన్ దినో’(Metro in Dino) సినిమా చేస్తోంది. సారా అలీఖాన్(Sara Ali Khan), ఆధిత్య కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ‘మెట్రో’కు సీక్వెల్‌గా జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఫాతిమా ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే.. ఫాతిమా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓ నిర్మాత తనతో తప్పుగా మాట్లాడినట్లు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

ఆమె వ్యాఖ్యలపై స్పష్టత

తాజాగా, ఈ విషయంపై మరోసారి స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉంటుందని నేను చెప్పలేదు. ఆ పరిశ్రమలో నాకు ఎదురైన సంఘటనలను గురించి మాత్రమే చెప్పా. నా వ్యాఖ్యల చుట్టూ అనవసర రాద్ధాంతం జరిగింది. మహిళలకు ప్రతి పరిశ్రమలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారో తెలియడం లేదు. నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తి ఒక చిన్నస్థాయి కాస్టింగ్ ఏజెంట్ లేదా నిర్మాత అయి ఉండొచ్చు.

మలయాళ సినిమాల్లో నటించాలనే కోరిక

అంతేకానీ ఆ పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కాదు’’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన కోరికను కూడా బయటపెట్టింది. ‘‘మలయాళ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను కూడా ఒకటి చేయాలనుకుంటున్నాను. ఆ ప్రపంచంలో నేను ఒక భాగం కావాలనుకుంటున్నాను. వారి సినిమాలను చూడండి! సూపర్ డీలక్స్, కుంబలంగి నైట్స్ చాలా అద్భుతమైన చిత్రాలు. అవి చాలా బాగా చిత్రీకరించబడ్డాయి. చాలా సంక్లిష్టమైన భావోద్వేగాలతో తీశారు. మీరు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతిని ఒకే ఫ్రేమ్‌లో చూడవచ్చు. వారు ఎంత మంచివారో! రోషన్ మాథ్యూ కూడా అంత అద్భుతమైన నటుడు’’ అని చెప్పుకొచ్చింది.

ఫాతిమా సనా షేక్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడంపై వివరణ ఇచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటించాలనే ఆమె ఆసక్తిని కూడా వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.