
దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ కథనంలో, ప్రతి రోజు ఏ దేవతను పూజించి, ఏ పూలు సమర్పించాలో తెలుసుకుందాం.
Key Points
నవరాత్రుల్లో ప్రతి రోజు అమ్మవారికి విభిన్న పూలను సమర్పించండి.
ప్రతి దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
శాంతి, ఆరోగ్యం, సంతోషం కోసం సరైన పువ్వులను ఎంచుకోండి.
నవరాత్రుల సమయంలో దేవతలను ఆరాధించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందవచ్చు.
నవరాత్రి పూజా విధానం
ఈరోజు నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం చూసినట్లయితే ఒక్కో దేవతకు ఒక్కో పువ్వు అంటే ఎంత ఇష్టం. మరి ఈ దసరా నవరాత్రుల్లో ఏ రోజు ఏ పూలను సమర్పించడం వలన అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి?
సానుకూల శక్తి లభించాలంటే ఏ పూలను సమర్పించాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తొమ్మిది రోజులు ఏ పూలను ఎప్పుడు సమర్పించాలో తెలుసుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. శ్రేయస్సు, అదృష్టాన్ని కూడా కలిగేలా చేసుకోవచ్చు.
మొదటి రోజు శైలపుత్రి పూజ. ఈరోజు అమ్మవారికి తెల్లటి పువ్వులను లేదా తెల్లటి కమలాలను సమర్పించడం మంచిది. ఈ పూలను సమర్పించడం వలన జీవితంలో శాంతి ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది.
రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలు, గులాబీలు సమర్పించడం మంచిది. బ్రహ్మచారిణికి ఈ పూలు అంటే చాలా ఇష్టం. వీటిని సమర్పిస్తే ఏకాగ్రత పెరుగుతుంది, భక్తి కూడా ఎక్కువవుతుంది.
ప్రతి రోజుకు సరైన పువ్వులు
మూడవ రోజు చంద్రఘంట. చంద్రఘంటను ఆరాధించేటప్పుడు బంతి పువ్వులను సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన శత్రువులపై విజయాన్ని సాధించవచ్చు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
నాలుగవ రోజు కూష్మాండ దేవిని ఆరాధించాలి. ఎర్రమందారాలను సమర్పిస్తే మంచిది. ఇలా చేయడం వలన దీర్ఘాయువు లభిస్తుంది, ఆరోగ్యం, తేజస్సు కూడా ఉంటాయి.
ఐదవ రోజు స్కందమాతను పూజించాలి. కమల పువ్వులు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇలా చేయడం వలన శ్రేయస్సు లభిస్తుంది.
ఆరవ రోజు కాత్యాయని దేవిని పూజించాలి. కదంబ పువ్వులను సమర్పించాలి. ఈ పూలను సమర్పిస్తే వైవాహిక జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.
శుభ ఫలితాల కోసం పూజా విధానం
ఏడవ రోజు కాళరాత్రి అమ్మవారిని పూజించేటప్పుడు మల్లె పువ్వులను సమర్పించాలి. అదే విధంగా నీలం రంగు కృష్ణతామర పువ్వులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం. వీటిని సమర్పించడం వలన భయం తొలగిపోతుంది.
ఎనిమిదవ రోజు మహాగౌరిని ఆరాధించేటప్పుడు తెల్లటి పూలు, గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేయడం వలన ఆనందం , సంతృప్తి ఉంటాయి.
తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవికి నీలి కమలాలను సమర్పించండి. మల్లెపూలను కూడా సమర్పించవచ్చు. ఇలా చేయడం వలన జీవితంలో విజయాలు ఉంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నవరాత్రి పూజను శ్రద్ధగా నిర్వహించడం వల్ల మనసుకు శాంతి, జీవితంలో శ్రేయస్సు లభిస్తాయి. ఈ సమాచారం సూచనార్థమే, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


