
దసరా సినిమాలో విలన్‌గా నటించిన షైన్ టామ్ చాకో ఇటీవల కారు ప్రమాదంలో తండ్రిని కోల్పోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ఆయన ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.
Key Points
దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో కారు ప్రమాదంలో తండ్రి మృతి.
ప్రమాద సమయంలో నిద్రపోతున్న చాకో, ఉలిక్కిపడి లేచాక ప్రమాదాన్ని గమనించారు.
తీవ్ర విషాదంలో చాకో నడిరోడ్డుపై ఏడ్చారు, సహాయం కోసం వేడుకున్నారు.
ప్రమాదంలో చాకోకు 30 కుట్లు పడ్డాయి, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలు.
కారు ప్రమాదంలో తండ్రి మృతి
కోలీవుడ్ నటుడు, ‘దసరా’ ఫేం షైన్ టామ్ చాకో(Shine Tom Chacko ) ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 6న తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకోట్టై సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో అతని తండ్రి సీపీ చాకో మృతి చెందగా, తల్లి, సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాజాగా ఈ విషాద ఘటనపై చాకో స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగిందని, తండ్రి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఎమోషనల్ అయ్యారు.
నడిరోడ్డుపై విషాదం
‘ప్రమాదం జరిగిన సమయంలో నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నాను. మధ్యలో రెండు, మూడు సార్లు మెళకువ వచ్చింది. నాన్నని బిస్కెట్లు అడిగి తిని మళ్లీ నిద్రపోయాను. కాసేపటి తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి చిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. ఎలా జరిగిందో తెలియదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాం.అమ్మ షాక్‌కి గురైంది. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం?’ , ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించింది.
30 కుట్లు, తీవ్ర గాయాలు
మా నాన్నను ఎన్నిసార్లు పిలిచిన పలకలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘దయచేసి ఎవరైనా సహాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ నడిరోడ్డుపైనే ఏడ్చేశాను. నా జీవితంలో తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నాను’ అని చాకో చెప్పారు. ఈ ప్రమాదం తనకు 30 కుట్లు పడ్డాయని, తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు.
ఈ విషాద ఘటన షైన్ టామ్ చాకో జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసింది. తన కుటుంబం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు.


