|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘దీపికా పడుకోణె’కు గోల్డెన్‌ ఛాన్స్‌.. మరికొన్ని గంటల్లో ప్రకటన (AA22)

Published: 06-06-2025, 11:42 AM
'దీపికా పడుకోణె'కు గోల్డెన్‌ ఛాన్స్‌.. మరికొన్ని గంటల్లో ప్రకటన (AA22)

అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న AA22 చిత్రం తాజా అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 7న ఒక ముఖ్యమైన ప్రకటన రానున్నట్లు సమాచారం.

Key Points

1

అల్లు అర్జున్ – అట్లీ సినిమా (AA22)కి సంబంధించిన కీలక అప్డేట్ జూన్ 7న రానుంది.

2

దీపికా పడుకోణె AA22 లో హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

4

రూ. 700 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

AA22 సినిమా అప్డేట్

అల్లు అర్జున్‌,  దర్శకుడు అట్లీ సినిమా (AA22) నుంచి జూన్‌ 7న ఒక అప్డేట్‌ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఒక పోస్ట్‌ పంచుకుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి కూడా.. త్వరలో షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శకుడు అట్లీ హైదరాబాద్‌ చేరుకుని, అల్లు అర్జున్‌తో సినిమా నిర్మాణ పనులకు సంబంధించిన చర్చలు చేశారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 700 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే, శనివారం ఉదయం 11గంటలకు ఒక ఆప్డేట్‌ ఇస్తామని పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. బహుశా హీరోయిన్‌ గురించి ప్రకటన చేస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

దీపికా పడుకోణె హీరోయిన్ గా?

అల్లు అర్జున్‌- అట్లీ (AA22) సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ ‘దీపికా పడుకోణె'( Deepika Padukone) నటిస్తున్నట్లు టాక్‌ ఉంది. తనకు సంబంధించిన అప్డేట్‌ శనివారం అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం. ఇదే ప్రాజెక్ట్‌లో జాన్వీ కపూర్‌, మృణాల్ ఠాకూర్‌ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, వారిద్దరి గురించి అధికారిక ప్రకటన కోసం కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే. దాదాపు జూన్‌ 7న మాత్రం దీపిక ప్రకటన ఉంటుందని బలంగా వార్తలు వస్తున్నాయి. (AA22) పేరుతో ప్రారంభమైన ఈ మూవీకి ఐకాన్‌, సూపర్‌హీరో అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

సినిమా వివరాలు

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు సమాచారం. కథకు  తగ్గట్లుగానే  అల్లు అర్జున్‌ పలు లుక్స్‌ను ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉండే సైన్స్‌ఫిక్షన్‌ సినిమాగా ఇది రానున్నట్లు  ప్రచారంలో ఉంది. అందుకోసం చిత్రబృందం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగింది.

అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న AA22 చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.