
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వర్కింగ్ అవర్స్ షరతులతో కల్కి, స్పిరిట్ వంటి ప్రభాస్ సినిమాల నుండి తొలగించడంపై స్పందిస్తూ, తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. నిశ్శబ్దంగా పోరాడతానని, పేర్లు చెప్పనని ఆమె పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Key Points
దీపికా పదుకొనె మరోసారి హాట్ కామెంట్స్ చేసింది.
వర్కింగ్ అవర్స్ షరతుల కారణంగా కల్కి, స్పిరిట్ నుండి తొలగింపు.
నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన దీపికా.
నిశ్శబ్దంగానే పోరాడతానని, పేర్లు చెప్పనని దీపికా స్పష్టం చేసింది.
దీపికా పదుకొనె తాజా హాట్ కామెంట్స్
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఉండగా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పదుకొనె కండీషన్స్ పెట్టడం వల్ల కల్కి, స్పిరిట్ లాంటి రెండు భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను తొలగించారు(Deepika Padukone). ఈ రెండు ప్రభాస్ సినిమాలే కావడం విశేషం. దీంతో, ఆమె పేరు కాస్త ఒక్కసారిగా ఇండియా సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ నడించింది.
Pradeep Ranganathan: ఓజీ వైబ్ నెక్స్ట్ లెవల్ అసలు.. పవన్ కళ్యాణ్ పై ప్రదీప్ రంగనాథన్ క్రేజీ కామెంట్స్
కల్కి, స్పిరిట్ సినిమాల నుండి తొలగింపుపై స్పందన
ఇప్పుడు తాజాగా మరోసారి ఈ విషయం స్పందించింది దీపికా. ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “‘ఆత్మాభిమానం ఉన్న నటిగా నన్ను ఇబ్బందిపెట్టే విషయాలను అంగీకరించలేను. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ ఎన్నోఏళ్లుగా 8 గంటలు పని చేస్తున్నారు. ఇదేం కొత్త కాదు, రహస్యం అంతకన్నా కాదు. కానీ, ఇన్నేళ్లలో ఈ విషయం ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వాళ్ల పేర్లు కూడా నేను చెప్పాలనుకోవడం లేదు. కొంతమంది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్స్ చేస్తారు. నాకు ఇదేమి కొత్త కాదు. చాలాసార్లు ఎదుర్కొన్నాను.
8 గంటల పనిపై దీపికా వివాదాస్పద వ్యాఖ్యలు
నేనెప్పుడూ దేనిపైనా ఓపెన్ గా స్పందించను. నిశ్శబ్దంగా యుద్ధం చేయడమే నాకు తెలుసు. అలా చేస్తేనే అది గౌరవం అనిపించుకుంటుంది” అంటూ చెప్పుకొచ్చింది దీపికా. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, అంతా సైలెంట్ అయింది అనుకున్న వేళ ఇప్పుడు మరోసారి దీపికా ఈ కామెంట్స్ చేయడం ఏంటా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి దీపికా చేసిన ఈ కామెంట్స్ పై కల్కి సినిమా మేకర్స్, స్పిరిట్ సినిమా మేకర్స్ ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.
దీపికా పదుకొనె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఆమె ఇప్పుడు మరోసారి ఎందుకు స్పందించిందని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కల్కి, స్పిరిట్ మేకర్స్ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.


