|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Deepika Padukone: సినిమా కథ నచ్చింది కానీ పేమెంట్ నచ్చలేదు.. ఫైనల్‌గా ఓపెన్ అయిన దీపికా పదుకొణె (వీడియో)

Published: 30-05-2025, 11:50 AM
Deepika Padukone: సినిమా కథ నచ్చింది కానీ పేమెంట్ నచ్చలేదు.. ఫైనల్‌గా ఓపెన్ అయిన దీపికా పదుకొణె (వీడియో)

Key Points

1

దీపికా పదుకొణెకు ‘స్పిరిట్’ సినిమా కథ నచ్చింది.

2

కానీ, ఆమెకు అందించిన పారితోషికం తక్కువగా ఉండటంతో సినిమాలో నటించడానికి నిరాకరించింది.

3

చివరికి త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

‘స్పిరిట్’ సినిమా వివాదం

ప్రజెంట్ ‘స్పిరిట్’ (Spirit) సినిమా ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకుణె(Deepika Padukone)ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని ఫిక్స్ చేస్తూ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్. అప్పటి నుంచి ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా ట్విట్టర్ వేదికగా సినిమా స్టోరీని కావాలనే లీక్ చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించాడు.

అయితే.. ఎవరు ఏంటీ అన్నది పేరు మాత్రం చెప్పలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికె పదుకొణె కూడా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ‘రీసెంట్‌గా ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ డైరెక్టర్ నాకు కథ చెప్పారు. క్రియేటివ్‌ల్లీ నాకు కథ చాలా నచ్చింది. ఇక మనీ గురించి మాట్లాడినప్పుడు.. నేను ఇంత చార్జ్ చేస్తా అని చెప్పాను. వాళ్లు దానికి ఒప్పుకోలేదు. అంతే నేను దానికి టాటా బైబై అన్నాను. ఎందుకంటే నా ట్రాక్ రికార్డ్ ఏంటో నాకు తెలుసు.. నేను ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ సినిమాకు ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

దీపికా పదుకొణె ప్రకటన

పారితోషికం వివాదం

చివరికి దీపికా పదుకొణె తన నిర్ణయంపై స్పష్టతనిస్తూ, కథ నచ్చినప్పటికీ పారితోషికం సరిపోలేదని తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.