
📌 Key Points
- దీపికా పదుకొనేపై జరుగుతున్న ట్రోల్స్‌పై ఆమె స్పందించారు.
- రణవీర్ సింగ్ సినిమా ‘ధురంధర్ 2’ విజయం సాధించింది.
- దీపిక తన భర్త సినిమా చూడలేదని నెటిజన్లు ట్రోల్ చేశారు.
- దీపిక తనదైన శైలిలో ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమాపై స్పందించకపోవడంపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. దీనికి దీపిక ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దీపికా పదుకొనేపై ట్రోల్స్ ఎందుకు?
Dhurandhar 2:ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Padukone) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పై గత కొంతకాలంగా తీవ్రమైన తిరుగుబాటు జరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది కమర్షియల్ అనే కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది పలు రకాల కామెంట్లతో సోషల్ మీడియాలో ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా ఈమెపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈమెను తన సినిమా నుండి తీసేసి అవమానించారు అని అభిమానులు కూడా పూర్తిస్థాయిలో హర్ట్ అయ్యారు.
అయితే దీపికా పదుకొనే మాత్రం తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ..నేడు అంతర్జాతీయంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమెపై ఇప్పుడు మరొకసారి ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తన భర్త రణవీర్ సింగ్ ఇటీవల నటించిన చిత్రం ధురంధర్ 2. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ సెన్సేషన్ హిట్ గా నిలబడమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇక ఈ సినిమా సక్సెస్ ఒకవైపు జోరుగా సాగుతుంటే.. మరొకవైపు రణవీర్ భార్య ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొనే మాత్రం ఈ సినిమాపై ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టలేదు సరి కదా కనీసం బహిరంగంగా కూడా ఎక్కడ ఆమె ఈ సినిమా గురించి ప్రస్తావించలేదు.. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
నెటిజన్ల ప్రశ్నలకు దీపిక సమాధానం
అంతటితో ఆగకుండా ఈ విషయంపై ఒక నెటిజన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా దీపికాను ఉద్దేశిస్తూ..” నీ భర్త సినిమా అంత పెద్ద విజయం అయింది. రికార్డులు కూడా తిరగ రాస్తోంది. కానీ నువ్వు మాత్రం ఆ సినిమాను ఎందుకు చూడలేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడలేదు?” అంటూ నేరుగానే ప్రశ్నించాడు. అయితే ఇన్ని రోజులు ఈ ట్రోల్స్ విని చూసి విసిగిపోయిన దీపికా పదుకొనే ఎట్టకేలకు తనదైన శైలిలో స్పందిస్తూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
“మీ అందరికంటే నేను నా భర్త సినిమాని చూశాను. కానీ ఆ విషయం మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి అసలు విషయం తెలియకుండా ఎవరు ఎవరిని విమర్శించాలి?” అంటూ తనదైన స్టైల్ లో ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. మొత్తానికైతే దీపికా ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ తో ఇప్పుడు ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయి అనడంలో సందేహం లేదు. ఏమైనా దీపిక చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
సాధారణంగా ఈ జంట ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ ఉండే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి రణవీర్ సింగ్ ధురంధర్ సినిమా విషయంలో దీపికా సైలెంట్ గా ఉండడంతో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. పైగా దీపిక రణవీర్ నుంచి దూరంగా ఉంది అనే కామెంట్లు కూడా వచ్చాయి.అయితే వీటన్నింటినీ ఆమె చెక్ పెట్టింది. అందులో భాగంగానే తన భర్తతో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ రణవీర్ ని చూసిన అభిమానులు “బబ్బర్ షేర్” అంటూ నినాదాలతో ముంచెత్తగా దీపికా మాత్రం తన భర్త విజయాన్ని చూసి మురిసిపోయింది.
దీపికా పదుకొనే తనదైన శైలిలో ట్రోలర్లకు సమాధానం చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికింది. ఆమె సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


