
📌 Key Points
- దీపికా, రణవీర్ ముంబైలోని బాంద్రాలో రూ. 119 కోట్ల విలువైన ఇల్లు కొన్నారు.
- ఈ కొత్త ఇల్లు షారుఖ్ ఖాన్ నివాసమైన ‘మన్నత్’కు దగ్గరగా ఉంది.
- ఈ అపార్ట్‌మెంట్ 16 నుండి 19 అంతస్తులలో విస్తరించి ఉంది.
- దీపికా పదుకొనే అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశారు. బాంద్రాలో దాదాపు రూ. 119 కోట్ల విలువైన ఈ ఇంటి గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
దీపికా, రణ్‌వీర్ కొత్త ఇంటి విశేషాలు
Deepika – Ranaveer : బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ఒకరు.. వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జంట ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ జంట తమ సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు.. ఇదిలా ఉండగా ఈ జంట కొత్తగా ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతే కాదు ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశారట.. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఆ ఇంటి ఖరీదు ఎన్ని కోట్లు? ఎక్కడ ఆ ఇల్లు కొన్నారు అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ వాంటెడ్ కపుల్స్ లలో రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 119 కోట్ల భారీ ఖరీదుతో కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన మాన్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్ని కోట్లు పెట్టి కొనడం అనేది మామూలు విషయం కాదు అని ఆ జంట అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఈ జంట ఎప్పుడూ హుందాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే తమ అభిరుచిని పెంచుకుంటూ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తూ వస్తుంటారు. ప్రస్తుతం ఈ ఇంటి గురించి బాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి..
ఇంటి ఖరీదు మరియు స్థానం
సినిమాలతో బిజీగా ఉన్న ఈ జంట
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకొనే – రణవీర్ సింగ్ కొనుగోలు చేసిన ఆ ఇంటి ప్రత్యేకతల విషయానికొస్తే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నివాసమైన `మన్నత్` కు దీపిక కొత్త ఇల్లు చాలా దగ్గరగా ఉంది. ఇకపోతే బాంద్రాలోని`సాగర్ రేష్మ్`. ఇక అపార్ట్‌మెంట్‌లో 16, 17, 18 , 19వ అంతస్తులలో ఇది ఉంటుంది. నిజానికి ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్స్ లో ఒకటిగా మారడం విశేషం.. సముద్రం అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.. అతి త్వరలోనే ఈ జంట ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం.. ఇక సినిమాల విషయానికొస్తే.. దీపికా పదుకొనే అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ మాత్రం రీసెంట్గా దురంధర్ 2 మూవీతో ప్రేక్షకుల ను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులలో నటించబోతున్నట్లు సమాచారం.. వీరిద్దరు కూడా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
మొత్తానికి దీపికా, రణ్‌వీర్ కలిసి కొత్త ఇల్లు కొనడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వారి అభిమానులు ఈ జంట సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ జంట కొత్త ఇంట్లోకి అడుగుపెట్టనున్నారు.


