
📌 Key Points
- బిగ్ బాస్ జోడీలో దుమ్మురేపిన డిమాన్ పవన్, రీతూ చౌదరి జోడి!
- హాట్ సాంగ్ తో స్టేజి మీద హీట్ పెంచేసిన ఈ జంట పెర్ఫార్మెన్స్.
- నయని పావనికి రీతూ చౌదరి స్ట్రాంగ్ కౌంటర్లు.. రచ్చ షురూ!
- BB జోడీలో మిగతా కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇవ్వనున్న ఈ జంట.
బిగ్ బాస్ ఫేమ్ డిమాన్ పవన్, రీతూ చౌదరి మరోసారి కలిసి సందడి చేయడానికి సిద్ధమయ్యారు. BB జోడిలో వీరి ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. వీరి హాట్ పెర్ఫార్మెన్స్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
BB జోడిలో రీతూ, పవన్ ల ఎంట్రీ అదిరింది!
BB JODI : ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 పూర్తయింది. కళ్యాణ్ పడాల ఈ సీజన్ కప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయింది. డిమాన్ పవన్ రెండో రన్నరప్ గా నిలవగా రీతూ చౌదరి చివరి వరకు వచ్చి 90 రోజుల తర్వాత ఎలిమినేట్ అయింది. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది.(BB JODI)
ఇటీవల డ్యాన్స్ షో BB జోడికి డిమాన్ పవన్- రీతూ చౌదరి జంటగా వస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి వచ్చారు.మొదటి పర్ఫార్మెన్స్ లోనే హాట్ సాంగ్ తో హాట్ డ్యాన్స్ తో రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ చేసి వైరల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.
హాట్ సాంగ్ తో దుమ్మురేపిన ఈ జంట పెర్ఫార్మెన్స్
ఇక రావడంతోనే మిగతా కంటెస్టెంట్స్ తో గొడవ కూడా పెట్టుకుంది రీతూ. డ్యాన్స్ బాలేదు అన్న నయని పావనికి కౌంటర్లు ఇచ్చింది. మిగతా వాళ్లకు కూడా రీతూ గట్టిగానే సమాధానాలు ఇచ్చింది. దీంతో BB జోడిలో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట గట్టిగానే అందరికి కాంపిటేషన్ ఇచ్చేలా ఉన్నారు.
నయని పావనికి రీతూ కౌంటర్లు.. రచ్చ షురూ!
మీరు కూడా రీతూ చౌదరి – డిమాన్ పవన్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రోమో చూసేయండి..
డిమాన్ పవన్, రీతూ చౌదరి జోడి BB జోడిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి. వీరి ప్రయాణం ఎలా సాగుతుందో వేచి చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


