
కార్తీక దీపం 2 లోని ఈరోజు ఎపిసోడ్ అనేక ఆశ్చర్యాలతో నిండి ఉంది. దీప, దశరథ, జ్యోత్స్న మరియు అనసూయల మధ్య సంఘటనలు తీవ్రమైన మలుపు తిరిగాయి. కుబేర్ ఆబ్దికం కార్యక్రమం కథాంశాన్ని మరింత ఉత్కంఠభరితం చేసింది.
Key Points
దీప దశరథను నాన్న అని పిలిచి అందరినీ షాక్‌కు గురిచేసింది.
జ్యోత్స్న మరియు ఇతర కుటుంబ సభ్యుల మధ్య గొడవలు చెలరేగాయి.
అనసూయ కుబేర్ కన్నతండ్రి కాదని వెల్లడించింది.
కుబేర్‌కు దీప చేసిన ఆబ్దిక కార్యక్రమం చాలా భావోద్వేగంతో కూడుకుంది.
దీప యొక్క సంచలన ప్రకటన
కార్తీక దీపం 2 టుడే జులై 31వ తేదీ ఎపిసోడ్ లో దీప అమ్మానాన్న విషయంలో నోరు జారి, మళ్లీ కాంచన దగ్గర కవర్ చేస్తాడు కార్తీక్. ఏంటి బావ, ఎందుకు అలా మాట్లాడావు? నాన్న మాటలు విన్నాక ఈ ఆబ్దికం చేసి తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుందని దీప అంటే.. నాన్న అని పిలిచావు కదా, కుబేర్ కూడా కన్న కూతురిలా పెంచాడు కదా. ఆయన రుణం తీర్చుకుంటున్నానని అనుకో. నా మేనత్త కూతురును అనాథను చేయకుండా తిరిగి నా చేతికి అందించాడు. కుబేర్ రుణం తీర్చుకోవాలని కార్తీక్ చెప్తాడు.
మరోవైపు శ్రీధర్ హడావుడి చూసి ప్రశ్నిస్తుంది కావేరి. భార్యకు సీక్రెట్లు చెప్పిన భర్త బాగు పడ్డట్లు నాలుగు పెళ్లిలు చేసుకున్న వ్యక్తి చెప్పాడని శ్రీధర్ అంటాడు. పెళ్లి అయిన తర్వాత ఏ భర్తకు దెయ్యాలు కలలోకి రావు. ఎందుకంటే కళ్ల ముందే ఉంటాయి కాబట్టి. మగాడి జీవితం ఆడదాని చేతిలో చింతకాయ పచ్చడిలా ఉంటుందిలే అని శ్రీధర్ అంటాడు. రేపు సర్ ప్రైజ్ అంటూ కావేరికి చెప్పి వెళ్లిపోతాడు శ్రీధర్.
ఉదయం కుబేర్ ఆబ్దికం కార్యక్రమాలను దీప నిర్వహిస్తుంది. కుబేర్ తో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. కుబేర్ కన్న కూతురివి కాదు అని కార్తీక్, అనసూయ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది దీప . బాధతోనే పిండ ప్రదానం చేస్తుంది. మేమిద్దరం ఒక రక్తం పంచుకుని పుట్టిన అక్కాతమ్ముళ్లం. బతికున్నప్పుడు ఒక ముద్ద కూడా పెట్టలేదు. కనీసం ఇప్పుడైనా వాడి ఆకలి తీర్చనివ్వు అని పిండాలను అనసూయ తీసుకుంటుంది.
కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవలు
అన్నదాన కార్యక్రమానికి అన్నీ రెడీ అవుతాయి. కుబేర్ ఫొటోకు దీప దండం పెట్టుకుంటుండగా దశరథ, సుమిత్ర, జ్యోత్స్న , పారిజాతం వస్తారు. సుమిత్ర, కాంచన ఒకరినొకరు చూసుకుంటూ నిశ్చితార్థానికి రాలేదని, అన్నదానానికి వచ్చానని ఏమనుకుంటుందో అని మనసులో అనుకుంటారు. దీప వెళ్లి వడ్డిస్తుంది. మీ అమ్మ మౌనవ్రతం చేస్తుందా? కనీసం పలకరింపు లేదని పారు అంటుంది. అత్తకు మనం గుర్తున్నామో లేదా? అని జ్యో అంటే.. సొంతవాళ్లనే మర్చిపోయేంతగా మారలేదు మేనకోడలా అని కాంచన అంటుంది. అందుకే మరి మేనకోడలు నిశ్చితార్థం అని పిలవగానే వచ్చావని సుమిత్ర అంటుంది. కోడలిని పిలవలేదు కాబట్టి ఆమె రాలేదని పారిజాతం మరింత మంట పెడుతుంది.
మనసులో బాధగా అనిపించి నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయాను అన్నయ్య అని కాంచన చెప్తుంది. నువ్వు రాకపోవడమే మంచిది అయింది, అలాంటి దుర్మార్గుడి చేతిలో నా కూతురు జీవితం నాశనం అవనందుకు చాలా సంతోషంగా ఉందని దశరథ అంటాడు. కాసేపు అయిన తర్వాత అడ్డమైన వాళ్లు వస్తారని పారు అంటుండగానే నేను వచ్చేశానని కావేరీతో కలిసి శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. పిలవని పేరంటానికి వచ్చి పోతుంటారని పారు అంటుంది. పారుపై కౌంటర్లు వేస్తాడు శ్రీధర్.
అన్నదానానికి అందరూ ఆహ్వానితులేనని దీప అంటుంది. అందుకే వచ్చామని శ్రీధర్ చెప్తాడు. సైలెంట్ గా తిని వెళ్లమని కార్తీక్ అంటాడు. హలో బావ నా పేరు శ్రీధర్ ని దశరథను పలకరిస్తాడు శ్రీధర్. పేరు గుర్తుందిలే అని దశరథ చెప్తాడు. నా మేనకోడలి నిశ్చితార్థం ఆగిపోయిందంట కదా, ఆ గౌతమ్ పెద్ద వేస్ట్ అంట కదా అని శ్రీధర్ అంటాడు. ఈయన అంతే పాత విషయాలన్నీ తవ్వుతుంటాడని కావేరి అంటుంది.
కుబేర్ ఆబ్దిక కార్యక్రమం
దీప మీద మా మమ్మీకి ఉన్న కోపం ఇంకాస్త పెంచేలా జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. సందర్భాన్ని క్రియేట్ చేసుకోవాలని పారుతో చెప్తుంది జ్యో. దీప ప్లేట్లు తీసుకొచ్చి ఇస్తుంది. దశరథ కుర్చీలో కూర్చుంటూ బ్యాలెన్స్ తప్పితే పట్టుకున్న దీప నాన్న అనేస్తుంది. ఏంటి దీప అన్నావ్? అని జ్యో రచ్చ చేస్తుంది. ఎన్నిసార్లు ఇలా పిలుస్తారు? ఈ రోజు ఎందుకు పిలిచిందో అడగండని జ్యో అంటుంది. నాన్న ఆబ్దికం కాబట్టి అదే ఆలోచనలో ఉండి నాన్న అని పిలిచిందేమో అని కార్తీక్ అంటే.. ప్రతి ఒక్కరినీ నాన్న అని పిలుస్తుందా అని పారు అడుగుతుంది. వెంటనే దశరథ సీరియస్ అవుతాడు. చూసేవాళ్లు దీప నీ కూతురు అనుకుంటారంటూ గొడవను పెద్దగా చేస్తుంది పారు. అనుకుంటే అనుకోని పిన్ని, నేనేం సిగ్గుపడను అని దశరథ అంటాడు. కానీ నేను సిగ్గు పడతాను డాడీ అని జ్యో అంటుంది.
వాళ్ల నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎన్ని పాపాలు చేశాడో ఏమో అని పారు అంటే.. దీప సీరియస్ అవుతుంది. దశరథ నిజంగానే నాన్న అయిపోతాడా? మరి మీ నాన్న పోతే, ఒకవేళ మీ అమ్మ బతికుంటే ఆవిడకు ఈయన ఏం అయ్యేవాడో? అని పారు అనగానే.. కార్తీక్, దీప ఫైర్ అవుతారు. మతి ఉండే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? బుద్ధి ఉండద్దు అని కాంచన మండిపడుతుంది. నీ కోడలుకు ఏమైంది? చచ్చిపోయిన వాళ్ల నాన్నను తలుచుకుంటూ బాధ పడకుండా ఇలా పిలవడమేంటీ? చచ్చిపోయిన వాళ్లను చచ్చిపోయాడని అనకుండా ఏమంటారు? అని పారు రెచ్చగొడుతోంది. వెంటనే మా నాన్న చచ్చిపోలేదని దీప అనడంతో అందరూ షాక్ అవుతారు. అది నా తమ్ముడు కుబేర్ ఫొటో, దీపకు నాన్న కాదు అని అనసూయ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లోని సంఘటనలు కుటుంబంలోని సంబంధాలను, వారి మధ్య ఉన్న విభేదాలను హైలైట్ చేస్తూ ముగిసింది. దీప మరియు ఇతర పాత్రల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాలి.


