
📌 Key Points
- దేవర 2: రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది – నిర్మాత ప్రకటన!
- 2027 చివరి నాటికి థియేటర్లలో విడుదల కానున్న దేవర 2 – ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే!
- తొందర్లోనే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన!
- దేవర సినిమా ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది – ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్!
ఎన్టీఆర్ అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త! దేవర 2 గురించి నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండగే.
దేవర 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే దేవర అనే చెప్పాలి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆ మాస్ ఎంటర్టైనర్ 2024లో విడుదలై భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దేవర 2(Devara 2) కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఈ సీక్వెల్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నా మేకర్స్ మాత్రం ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయడంలేదు. కొన్నిసార్లు ఈ సినిమా ఆగిపోయింది ఇక రావడం కషటమే అని కామెంట్స్ కూడా వినిపించాయి. ఫ్యాన్స్ కూడా అదే నిజం అనుకోని నమ్మేశారు. కానీ, తాజాగా దేవర పార్ట్ 2పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. రీసెంట్ గా అయన నందిగామలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మాత మిక్కిలినేని సుధాకర్ సాలిడ్ అప్డేట్!
ఈ కార్యక్రమంలో ఆయనను దేవర పార్ట్ 2 గురించి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. ” దేవర 2 తప్పకుండా ఉంటుంది. ఈ సినిమాను రెగ్యులర్ షూటింగ్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. 2027 ఎండింగ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2027లో దేవర 2 విడుదల!
ఇక ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉంటుందా ఉండదా అనుకున్న సినిమా నుంచి ఏఇంత పెద్ద అప్డేట్ రావడంతో చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
దేవర 2 తప్పకుండా వస్తుంది అని నిర్మాత ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా కోసం వేచి చూడటం చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది.


