
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
- ‘దేఖ్ లేంగే సాలా’ పాట సోషల్ మీడియాలో ఇప్పటికే సంచలనం సృష్టించింది.
- దేవిశ్రీ ప్రసాద్ విదేశీ వీధుల్లో ఈ సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులు వేశారు.
- దేవిశ్రీ డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారి లక్షల వ్యూస్ సాధిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్టైలిష్ స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్(Hareesh Shankar) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh). ఇందులో శ్రీలీల(Sreeleela), రాశి ఖన్నా(Rashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’(Gabbar Singh) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఒక రేంజ్‌లో నెలకొన్నాయి.
‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సంచలనం
ఇక ఏప్రిల్‌లో థియేటర్లకు రానున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన మాస్ బీట్‌లు, చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన స్టైలిష్ డ్యాన్స్ ఈ పాటను ఫ్యాన్స్ ఫేవరెట్‌గా మార్చేశాయి. ఈ క్రమంలో తాజాగా దేవీశ్రీ ప్రసాద్ కూడా ఈ సాంగ్‌కు స్టెప్పులు వేశాడు.
దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పుల వీడియో వైరల్
విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్‌కు స్టైలీష్ స్టెప్స్ వేస్తూ అదరగొట్టిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు, దేవి చేసిన ఈ వీడియోకి కూడా ఒక రేంజ్‌లో వ్యూస్ వస్తున్నాయి. కాగా ఉస్తాద్ మూవీలో కేవలం ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు మిగతా సాంగ్స్ కూడా ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయట. ఇక గతంలో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా దేవి శ్రీనే మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.
‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ క్రేజ్ ఒక ఎత్తు అయితే, దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులతో ఈ పాటకు మరింత బూస్ట్ వచ్చింది. ఈ వీడియోతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.


