|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చాహల్ తో విడాకులు.. మళ్లీ ప్రేమలో పడతారా? ధనశ్రీ సంచలన సమాధానం!

Published: 02-06-2025, 8:47 AM
చాహల్ తో విడాకులు.. మళ్లీ ప్రేమలో పడతారా? ధనశ్రీ సంచలన సమాధానం!

కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ, క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తో విడాకుల తర్వాత తన జీవితం గురించి, ప్రేమ గురించి ఓపెన్ గా మాట్లాడింది. ఆమె తనపై వచ్చే పుకార్లను ఎలా ఎదుర్కొంటోందో వివరించింది.

Key Points

1

ధనశ్రీ వర్మ తన విడాకుల తర్వాత జీవితం గురించి మాట్లాడింది.

2

ఆమె తన చుట్టూ ఉన్న పుకార్లను పట్టించుకోదని చెప్పింది.

4

ధనశ్రీ ప్రస్తుతం తన భవిష్యత్తుపై దృష్టి పెట్టిందని తెలిపింది.

ధనశ్రీ వర్మ విడాకుల అనుభవం

కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తన వ్యక్తిగత జీవితంలో సంక్షోభ సమయంలో నిజం కాని కథనాలను ఎలా డీల్ చేస్తుందో ఓపెన్ అయింది. క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకులు తీసుకున్న కొన్ని నెలల తర్వాత మళ్లీ ప్రేమను వెతుక్కోవడానికి సిద్ధంగా ఉన్నానా అనే విషయంపై కూడా ధనశ్రీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడింది.

ధనశ్రీ తన గురించి వస్తున్న కథనాల గురించి మాట్లాడుతూ.. ‘నా చుట్టూ చక్కర్లు కొడుతున్న కథనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అవేవీ నేను ఎవరో ప్రతిబింబించవు. నా విలువలు, నా పెంపకం, నేను ఎలాంటి వ్యక్తినో నాకు తెలుసు కాబట్టి నేను వాటిని పట్టించుకోను. నేను ఎల్లప్పుడూ హుందాతనం, దయను కాపాడుకుంటానని నమ్ముతా. ఇతరులను కిందకు లాగడం నా మార్గం కాదు. జీవితంలో ఎదగడానికి ఇది ఎవరికీ సహాయపడదు” అని చెప్పింది.

పుకార్లపై ధనశ్రీ స్పందన

ప్రేమ గురించి ధనశ్రీ మాట్లాడుతూ.. ఓ వ్యక్తి ఇలాంటి విషయాలను ప్లాన్ చేయలేరు అని పేర్కొంది. మళ్లీ ప్రేమలో పడతారా? అనే ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

“నేను డెంటిస్ట్ గా ఉన్న సమయంలోనైనా లేదా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఉన్నా నా లక్ష్యాలపై నేను ఎల్లప్పుడూ చాలా దృష్టి పెట్టా. ప్యార్ కీ బాత్ కరేన్, తోహ్ (ప్రేమ గురించి మాట్లాడితే) మీరు ఈ విషయాలను ప్లాన్ చేయలేరు. నేను ఈ రోజు లేదా ఒక సంవత్సరం తరువాత ప్రేమ లో పడతానని మీరు నిర్ణయించలేరు. ప్రేమ అనేది పూర్తిగా భిన్నమైన అంశం. నాకు చాలా ముఖ్యమైనది.. మేరా ఫోకస్ మా మెయిన్ అప్నే లైఫ్ మే ఆగే క్యా దేఖ్ రహీ హూం (భవిష్యత్ పైనే నా ఫోకస్ ఉంది)’’ అని ధనశ్రీ తెలిపింది.

భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రేమ

ఈ ఏడాది మార్చిలో ముంబయి కోర్టు చాహల్ , ధనశ్రీ వర్మ ఉమ్మడి పిటిషన్ ను స్వీకరించి విడాకులు మంజూరు చేసింది. ఫిబ్రవరి 5న పరస్పర అంగీకారంతో విడాకులకు వీళ్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి 20న ఫ్యామిలీ కోర్టు తప్పనిసరిగా ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ను రద్దు చేయడానికి నిరాకరించింది. వీళ్లు పై కోర్టుకు వెళ్లి అప్పీల్ చేస్తే అప్పుడు విడాకులు మంజూరయ్యాయి. పెళ్లయిన 18 నెలల తర్వాత 2022 జూన్ నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

ధనశ్రీ, చాహల్ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో విడాకులపై పుకార్లు మొదలయ్యాయి. ధనశ్రీ, యుజ్వేంద్ర 2020 డిసెంబర్లో గురుగ్రామ్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. డ్యాన్స్ పాఠాల కోసం యుజ్వేంద్ర ఆమెను సంప్రదించినప్పుడు ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా కలుసుకుని, కనెక్ట్ అయ్యారు.

ధనశ్రీ వర్మ తన విడాకుల తర్వాత జీవితంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది. ప్రేమ గురించి ఆమె తన అభిప్రాయాలను పంచుకుంటూ, ప్రస్తుతం తన భవిష్యత్తుపై దృష్టి పెడుతోందని స్పష్టం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.