
📌 Key Points
- ధనుష్ 55వ సినిమాలో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా ఎంపిక.
- మారి 2 సినిమాలో ధనుష్, సాయి పల్లవి జోడికి మంచి ఆదరణ లభించింది.
- రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు.
- సాయి పల్లవికి స్వాగతం పలుకుతూ చిత్ర బృందం ఫోటోలు విడుదల చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్లు వీరే!
D55Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ధనుష్ తన 55వ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమాని అమరన్ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Raj Kumar Periasamy) దర్శకత్వంలో ప్రేక్షకులందరికీ రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి అయ్యాయి . ఇకపోతే కొంతకాలంగా ఈ సినిమాలో హీరోయిన్ల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ సినిమాలో ధనుష్ మరోసారి సాయి పల్లవి(Sai Pallavi) తో కలిసి నటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటించబోతున్నట్టు అధికారికంగా తెలియజేశారు. దీంతో ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అందరూ భావించారు అయితే తాజాగా చిత్ర బృందం మరోసారి ఈ సినిమా నుంచి ఊహించని అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో శ్రీ లీలతో పాటు సాయి పల్లవి కూడా నటించబోతున్నారని వెల్లడించారు. తాజాగా సాయి పల్లవికి వెల్కమ్ చెబుతూ చిత్ర బృందం విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ధనుష్ సినిమాలో శ్రీలీలతో పాటు సాయి పల్లవి కూడా నటించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, బ్లాక్ బస్టర్ జోడి రిపీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదివరకు సాయి పల్లవి ధనుష్ కాంబినేషన్లో మారి 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి సాయి పల్లవి ధనుష్ జంటగా కనిపించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి పల్లవి రాజ్ కుమార్ పెరియస్ స్వామి డైరెక్షన్ లో అమరన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. తిరిగి వీరి కాంబినేషన్ లో ధనుష్ సినిమా రావటం గమనార్హం.
మళ్ళీ కలిసిన ధనుష్ – సాయి పల్లవి జోడి!
She’s about grace and strength – all at once ❤️
Welcoming everybody’s favourite @Sai_Pallavi92 on board #D55 . The hit combo returns to the big screen. @dhanushkraja @Rajkumar_KP @wunderbarfilms @RTakeStudios @sreeleela14 @SaiAbhyankkar @Shra2309 @azy905 @theSreyas @sandy_sashr … pic.twitter.com/zycf0OiQKu
— Wunderbar Films (@wunderbarfilms) February 2, 2026
వైరల్ అవుతున్న సాయి పల్లవి వెల్కమ్ ఫోటోలు!
ఇక ఈ సినిమాలో శ్రీ లీల (Sreeleela) కూడా నటించబోతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇందులో ఎవరు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇక శ్రీ లీల కూడా ఇటీవల వరుస డిజాస్టర్ సినిమాలతో ఎంతో సతమతమవుతున్నారు. ఇలా తెలుగులో సక్సెస్ అందుకోలేని ఈ ముద్దుగుమ్మ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే తమిళంలో పరాశక్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ లీల అనంతరం ధనుష్ సినిమాలో అవకాశాన్ని అందుకోవడంతో విశేషం. మరి ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తానికి ధనుష్ సినిమాలో శ్రీలీలతో పాటు సాయి పల్లవి కూడా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.


