|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్‌ రూ. 20 కోట్లు డిమాండ్‌.. విషయం తెలిసి బాధేసింది: వెట్రిమారన్‌

Published: 30-06-2025, 10:19 PM
ధనుష్‌ రూ. 20 కోట్లు డిమాండ్‌.. విషయం తెలిసి బాధేసింది: వెట్రిమారన్‌

ధనుష్ మరియు వెట్రిమారన్ కాంబినేషన్ లో వచ్చిన వడచైన్నె సినిమా భారీ విజయం సాధించింది. వడచైన్నె 2 కోసం ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే వార్తలు ఇటీవల వైరల్ గా మారాయి. దీనిపై వెట్రిమారన్ స్పందించారు.

Key Points

1

వడచైన్నె 2 కోసం ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేశారనే వార్తలు వైరల్

2

వెట్రిమారన్ శింబుతో చేస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదని స్పష్టీకరణ

4

వెట్రిమారన్ ధనుష్ తో మాట్లాడి అనుమతి తీసుకుంటానని చెప్పారు

వడచైన్నె 2పై వార్తలు

నటుడు ధనుష్‌, దర్శకుడు వెట్రిమారన్‌ కాబినేషన్‌లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుష్‌ కావడం విశేషం. కాగా దానికి సీక్వెల్‌ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో వడచైన్నె– 2 చిత్రం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది ఆ చిత్రం ఉంటుందని ధనుష్‌ బదులిచ్చారు. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్‌ ఉత్తర చైన్నె నేపధ్యంలో నటుడు శింబు కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనతో కూడిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు.

వెట్రిమారన్ వివరణ

దీంతో నటుడు ధనుష్‌ నటించాల్సిన వడచైన్నె– 2లో శింబు నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అంతే కాకుండా వడచైన్నె– 2 చిత్ర కాపీ రైట్స్‌ కోసం నటుడు ధనుష్‌ రూ.20 కోట్లు డిమాండ్‌ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో దర్శకుడు వెట్రిమారన్‌ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి. ఆయన వివరణ ఇస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి తానూ గమనిస్తున్నానని, అయితే శింబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదనీ, ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే మరో కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

ధనుష్ స్పందన

అయితే వడచైన్నె చిత్రంలోని పాత్రల ఛాయలుగానీ కొనసాగింపులు గానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత (ధనుష్‌)తో తాము మాట్లాడుకుని అనుమతి పొందుతామని చెప్పారు. ఇకపోతే నటుడు ధనుష్‌ కాపీరైట్‌ రూ.20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై ధనుష్‌తో చర్చించానని, ఆయన సార్‌ మీకు ఏది కరెక్టో అది చేయండి, తాము తమ సైడ్‌ నుంచి నో అబ్జెక్స్‌ పత్రం ఇస్తాం అని చెప్పారన్నారు. అంతే కానీ డబ్బు ఏమీ వద్దు అని ఆయన చెప్పారన్నారు. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వదంతులు బాధిస్తున్నాయని దర్శకుడు వెట్రిమారన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వెట్రిమారన్ వివరణతో వడచైన్నె 2 చిత్రం చుట్టూ ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ధనుష్ సహకారంతోనే చిత్రం తెరకెక్కనుందని ఆయన స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.