|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

The Devils Chair: మూడు నెలల తర్వాత ఓటీటీకి ‘ది డెవిల్స్ ఛైర్’.. ఎక్కడ చూడాలంటే?

Published: 22-05-2025, 4:10 AM
The Devils Chair: మూడు నెలల తర్వాత ఓటీటీకి 'ది డెవిల్స్ ఛైర్'.. ఎక్కడ చూడాలంటే?

ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘ది డెవిల్స్ ఛైర్’ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదిరే అభి, స్వాతి మందల్ నటనతో ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

Key Points

1

జబర్దస్త్ అదిరే అభి, స్వాతి మందల్ నటించిన 'ది డెవిల్స్ ఛైర్' ఓటీటీలోకి!

2

మూడు నెలల తర్వాత ఆహాలో స్ట్రీమింగ్ ప్రారంభం.

4

డెవిల్ శక్తితో కూడిన ఛైర్‌ రహస్యం ఏమిటి? చివరిలో ఏం జరుగుతుంది?

‘ది డెవిల్స్ ఛైర్’ కథాంశం

జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్‌ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ది డెవిల్స్‌ చైర్‌'(the devil’s chair). ఈ సినిమాకు  గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు నెలల తర్వాత ఎలాంటి ‍ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహాలో ది డెవిల్స్ ఛైర్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహా ఓటీటీలో విడుదల

ది డెవిల్స్ చైర్‌ కథేంటంటే..

సినిమా ప్రత్యేకతలు

ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేసే విక్రమ్‌(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్‌ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు  రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్‌ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్‌లో ఓ డెవిల్‌ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్‌ చైర్‌ ఆఫర్‌ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్‌ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్‌లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్‌ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అదిరే అభి, స్వాతి మందల్ నటనతో ఆకట్టుకున్న ‘ది డెవిల్స్ ఛైర్’ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. మర్మమైన కథాంశం, ట్విస్టులు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.