|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఇళయరాజా బయోపిక్ నుండి ధనుష్ అవుట్? అసలు నిజం ఏమిటి?

Published: 09-02-2026, 9:35 AM
షాకింగ్: ఇళయరాజా బయోపిక్ నుండి ధనుష్ అవుట్? అసలు నిజం ఏమిటి?
  • ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
  • ఇళయరాజా బయోపిక్ లో ధనుష్ నటిస్తున్నాడు.
  • దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవం.
  • ధనుష్ కలాం బయోపిక్ లో కూడా నటిస్తున్నారు, దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా దర్శకుడు మారారని వస్తున్న వార్తలను ధనుష్ టీమ్ ఖండించింది.

ఇళయరాజా బయోపిక్ పై వస్తున్న రూమర్స్

Danush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన భాషతో సంబంధం లేకుండా ఇటీవల తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ధనుష్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. త్వరలోనే మరి కొంతమంది బయోపిక్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ధనుష్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) బయోపిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్(Arun Matheswaran) పనిచేస్తున్నారు. అయితే ఉన్నఫలంగా కొన్ని కారణాలవల్ల ఈయన తప్పుకోవడంతో కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలను చిత్ర బృందం పూర్తిగా ఖండించారు.

అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్..

ధనుష్ టీమ్ క్లారిటీ

ఇళయరాజా బయోపిక్ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనాలపై హీరో ధనుష్ టీం స్పందిస్తూ.. ఈ సినిమాకు డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ బదులుగా కొత్త డైరెక్టర్ వచ్చారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, ఈ వార్తలు పూర్తిగా ఆ వాస్తవం అని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇలాంటి పుకార్లను ఎవరు నమ్మవద్దు ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం అయ్యిందని ఈ సినిమాని డైరెక్టర్ అరుణ్ కొనసాగిస్తారు అంటూ ఈ వార్తలకు చెక్ పెడుతూ ధనుష్ టీం క్లారిటీ ఇచ్చారు.

కలాం: ది మిస్సైల్ మాన్ అఫ్ ఇండియా..

కలాం బయోపిక్ లో ధనుష్

ఇక ధనుష్ ఇళయరాజా బయోపిక్ సినిమాతో పాటు భారత మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆధారంగా కలాం:ది మిస్సైల్ మాన్ అఫ్ ఇండియా అనే బయోపిక్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు ఆది పురుష్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలతో పాటు ఈయన ఇటీవల రాజ్ కుమార్ పెరియార్ స్వామి డైరెక్షన్ లో కూడా మరో సినిమాకు కమిట్ అవ్వడం, ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శ్రీ లీల సాయి పల్లవి హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇలా ధనుష్ నిర్మాతగా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ధనుష్ ప్రస్తుతం రెండు బయోపిక్ లతో బిజీగా ఉన్నారు. ఇళయరాజా బయోపిక్ రూమర్స్ కు ధనుష్ టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కలాం బయోపిక్ కోసం ఎదురుచూడటం ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.