
📌 Key Points
- హీరో ధర్మ మహేష్ ‘జిస్మత్ మండీ’ రెస్టారెంట్లను ప్రారంభించారు.
- తన కొడుకు జగద్వజ పేరు మీద ‘Gismat’ని ‘Jismat’గా మార్చారు.
- అమీర్‌పేట్ తర్వాత చైతన్యపురిలో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశారు.
- ‘J’ అక్షరంతో పేరున్న వారికి మినీ చికెన్ మండీ ఉచితంగా అందిస్తారు.
తెలుగు సినీ నటుడు ధర్మ మహేష్ తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ‘జిస్మత్ మండీ’ రెస్టారెంట్‌ను ప్రారంభించి, తన కొడుకు పేరుపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ‘J’ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉచితంగా చికెన్ మండీ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
హీరో ధర్మ మహేష్ బిజినెస్ ఎంట్రీ
Dharma Mahesh : సినిమా హీరో, హీరోయిన్స్ బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటీవల చాలా మంది ఫుడ్ బిజినెస్ లు మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధర్మ మహేష్ జిస్మత్ మండీ రెస్టారెంట్స్ ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ల క్రితం ధర్మ మహేష్ తన భార్యతో ఉన్న వివాదంతో వైరల్ అయ్యాడు. (Dharma Mahesh)
తనకున్న ‘Gismat’ రెస్టారెంట్స్ ని తన కొడుకు జగద్వజ పేరు మీదకు మారుస్తూ తన కొడుకు పేరులోని ఫస్ట్ లెటర్ ని పెట్టి ‘Jismat’ గా తన రెస్టారెంట్స్ పేర్లు మార్చాడు. ఇటీవల అమీర్‌పేట్‌లో ఓ రెస్టారెంట్ ని ప్రారంభించగా తాజగా చైతన్యపురిలో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసాడు. ఈ సందర్భంగా తన రెస్టారెంట్ కి వచ్చేవాళ్లకు స్పెషల్ ఆఫర్ ఇచ్చాడు ఈ హీరో.
జిస్మత్ మండీ – కొత్త బ్రాంచ్, కొత్త పేరు
‘J’ పేరున్న వారికి అదిరిపోయే ఆఫర్
తన కొడుకు జగద్వజ లాగే ఎవరి పేరు అయినా J తో స్టార్ట్ అయితే వాళ్లకు మినీ చికెన్ మండీ ఫ్రీగా ఇస్తారట. ఈ ఆఫర్ కేవలం కొద్దీ రోజులు మాత్రమేనట. అందుకు మీ పేరు ఉన్న ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకటిస్తూ హీరో ధర్మ మహేష్ మాట్లాడుతూ.. తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో గిస్మత్ మండీ జిస్మత్ మండీ గా మారుస్తున్నామని తెలిపాడు. అలాగే ఈ రెస్టారెంట్స్ కంపెనీ యొక్క మొత్తం యాజమాన్యాన్ని తన కుమారుడు జగద్వాజకు అంకితం చేస్తున్నాడు మహేష్.
ధర్మ మహేష్ తన కుమారుడిపై ప్రేమను చాటుకుంటూ రెస్టారెంట్ వ్యాపారాన్ని విస్తరిస్తున్న తీరు అభినందనీయం. ఈ ఆఫర్ సినీ తారల వ్యాపార నైపుణ్యాన్ని, ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది.


