
📌 Key Points
- రణ్‌వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా ‘ధురంధర్’ చిత్రం భారీ విజయం సాధించింది.
- ‘ధురంధర్ : ది రివేంజ్’ పేరుతో సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది.
- యామి గౌతమ్ ఈ సీక్వెల్‌లో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
- భార్యకు గుర్తింపు ఇవ్వడానికి ఆదిత్యధర్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సీక్వెల్ ‘ధురంధర్: ది రివేంజ్’లో టాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 19న విడుదల కానుంది.
దుమ్మురేపిన ధురంధర్ మొదటి భాగం
Dhurandhar 2:ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (Adithya Dhar) దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధురంధర్.. రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్గా పరిచయం అవుతూ ఎటువంటి అంచనాలు లేకుండా 2025 డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టకపోయినా కేవలం మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని.. ఏకంగా 1350 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. అటు పాకిస్తాన్ లో కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా యానిమల్, పుష్ప 2 సినిమా రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసింది.
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ధురంధర్ : ది రివేంజ్’ పేరుతో మార్చి 19వ తేదీన విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్ తో జియో స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇక తాజాగా సీక్వెల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే ఇందులో టాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యామి గౌతమ్.. నువ్విలా, గౌరవం చిత్రాలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్లో భాగమైనట్లు తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు ఈ చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ భార్య కావడం గమనార్హం.
సీక్వెల్‌లో టాలీవుడ్ హీరోయిన్
2021 జూన్ 4వ తేదీన ప్రముఖ సినీ నటి యామి గౌతమ్ దర్శకుడు ఆదిత్యధర్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2024 మే 10న మొదటి సంతానంగా వేద విద్ ధర్ జన్మించారు. ఇక వివాహం తర్వాత హిందీలో వరుస సినిమాలు, సీరిస్ లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి గౌతమ్ ఇప్పుడు ఈ సీక్వెల్ లో కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇకపోతే ధురంధర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఆదిత్యధర్ ఈ సీక్వెల్ లో తన భార్యకు అవకాశం కల్పించి ఆమె పాత్రతో ఆమెకు ఊహించని ఇమేజ్ను అందేవ్వాలనే కీలక నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగానే ఈ సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినా ఆ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందని ఇప్పుడు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది..ఏది ఏమైనా భార్యకు గుర్తింపునివ్వడానికి ఆదిత్యధర్ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
భార్యకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
యామీ గౌతమ్ విషయానికి వస్తే.. తెలుగులో నువ్విలా అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన గౌరవం సినిమాలో నటించింది .ఇక యుద్ధం సినిమా తర్వాత నితిన్ హీరోగా వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె నటించిన ‘హక్’ చిత్రం విడుదల కాగా ఈ సినిమా ఈమెకు మంచి ఇమేజ్ అందించింది. మరోవైపు ధురంధర్ : ది రివేంజ్ లో యామి గౌతమ్ కీలకమైన పాత్రలో నటిస్తోంది అని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె పాత్ర కోసం ఎదురుచూస్తున్నారు.
మొత్తానికి, భార్య యామి గౌతమ్‌కు సీక్వెల్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా ఆదిత్యధర్ తీసుకున్న నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం యామి గౌతమ్ కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.


