|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణవీర్ విధ్వంసం! ‘దురంధర్ 2’ కలెక్షన్ల సునామీ! 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఖాయమా?

Published: 22-03-2026, 1:35 AM
రణవీర్ విధ్వంసం! 'దురంధర్ 2' కలెక్షన్ల సునామీ! 500 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఖాయమా?
  • రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్ 2’ ఉగాదికి విడుదలై భారీ వసూళ్లు సాధిస్తోంది.
  • ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
  • ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం మొదటి వారాంతానికి 600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
  • హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్ 2’ ఉగాది కానుకగా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 450 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది.

దురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్

Dhurandhar 2 Collections : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ చిత్రం దురంధర్ 2.. గతంలో వచ్చినా దురంధర్ మూవీకి  సీక్వల్ గా ఈ సినిమా తెరకెక్కింది. రీసెంట్గా ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. భాషా బేధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మూవీని విశేషంగా ఆదరిస్తున్నారు. దాంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సంచలన విజయం వైపు ప్రయాణిస్తున్నది.. దర్శకుడు ఆదిత్య ధార్, బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్, టాలెంటెడ్ యాక్టర్ ఆర్ మాధవన్, సారా అర్జున్ కాంబినేషన్‌లో ఈ చిత్రం గత రెండు రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. మూడో రోజు కూడా అదే విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. మూడు రోజులు గను ఈ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 43 కోట్ల రూపాయల నెట్, 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.. మొత్తంగా మొదటి రోజు కలెక్షన్స్ ను చూస్తే.. 121 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. రెండో రోజు 80 కోట్ల రూపాయల నెట్, 97 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 270 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు అటు ఓవర్సీస్ లో 78 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపుగా 350 కోట్లు వసూల్ అయ్యాయి. మూడో రోజు కూడా ఏమాత్రం తగ్గకుండా వసూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు 450 కోట్ల రూపాయలకు చేరువైంది. ఈ సినిమా తొలి వారాంతానికి 550 నుంచి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఈ నెలలోపల 3000 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ రణవీర్ సింగ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు..

రెండో రోజు కలెక్షన్ల వివరాలు

మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ధురంధర్ 2 ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ మూవీకి భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు తెలుస్తుంది. పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతాన్ని క్రియేట్ చేయడం కోసం భారీ సెట్స్ వేశారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్ల రెమ్యునరేషన్లు, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి దాదాపుగా 50 కోట్ల వ్యయంతో నిర్మించారు. సుమారుగా 30 కోట్ల రూపాయలను ప్రమోషనల్ కోసం ఖర్చు చేశారు..ఈ మూవీ టార్గెట్ 300 కోట్లకు పైగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయింది రెండు రోజుల్లోనే టార్గెట్ ని పూర్తి చేయడం మామూలు విషయం కాదు. ఇదే జోరులో కనుక కొనసాగితే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అన్నది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారింది.

మొత్తానికి ‘దురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అభిమానులు మాత్రం 3000 కోట్ల మార్క్ పై ఆశలు పెట్టుకున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.