
📌 Key Points
- రణవీర్ సింగ్ షూటింగ్ విరామంలో బామ్మను కలిసి పాదాభివందనం చేశారు.
- అభిమాని అయిన వృద్ధురాలు రణవీర్ కోసం గంటల తరబడి వేచి ఉంది.
- రణవీర్ వినయానికి అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు.
- పెద్దల పట్ల రణవీర్ సింగ్ గౌరవం అందరినీ ఆకట్టుకుంది.
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ తన వినయంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. షూటింగ్ విరామంలో ఒక వృద్ధ అభిమానిని కలిసి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బామ్మ కోసం ఎదురుచూసిన రణవీర్
Ranveer Singh: వెండితెరపై కనిపించే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. రంగురంగుల దుస్తులతో, చిత్ర విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే రణవీర్ సింగ్, ఈసారి ఒక మనసును హత్తుకునే ఘటనతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కోట్లు సంపాదించే స్టార్‌డమ్ ఉన్నా, దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. తన మూలాలను, పెద్దల పట్ల గౌరవాన్ని ఆయన మర్చిపోలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
షూటింగ్ విరామంలో ఊహించని దృశ్యం
ముంబైలోని ఒక ప్రముఖ స్టూడియోలో రణవీర్ సింగ్ తన తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. స్టూడియో బయట ఎప్పటిలాగే అభిమానుల కోలాహలం నెలకొంది. అయితే, ఆ గుంపులో ఒక వృద్ధురాలు (బామ్మ) రణవీర్‌ను ఒక్కసారైనా చూడాలని గంటల తరబడి ఎండను కూడా లెక్కచేయకుండా వేచి చూస్తోంది. ఈ విషయం సెట్స్ లో ఉన్న రణవీర్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్ విరామంలో నేరుగా ఆమె వద్దకు చేరుకున్నారు.
పాదాభివందనం చేసిన రణవీర్ సింగ్
గర్వం లేని ‘సూపర్ స్టార్’.. పాదాభివందనం!
సాధారణంగా ఒక స్టార్ హీరో వస్తున్నారంటే బాడీగార్డ్స్ హడావిడి, అభిమానులను దూరం నెట్టడం చూస్తుంటాం. కానీ రణవీర్ మాత్రం సెక్యూరిటీని పక్కకు తప్పుకోమని చెప్పి, నేరుగా ఆ బామ్మ దగ్గరకు వెళ్లారు. ఆమెను చూడగానే ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి, ఒక్కసారిగా ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక అగ్ర హీరో తన ముందు వంగి పాదాభివందనం చేయడంతో ఆ పెద్దావిడ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రణవీర్ తల నిమిరి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా రణవీర్ వినయానికి ఫిదా అయిపోయారు. కేవలం మొక్కి వదిలేయకుండా, ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించి, ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
చిరంజీవి కేవలం బ్లడ్ బ్యాంక్ ద్వారానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎందరినో ఆదుకున్నారు కూడా .తారక్ తన స్టాఫ్ పట్ల చూపించే ప్రేమ ఎంతో గొప్పది. తన డ్రైవర్ లేదా పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే, తానే స్వయంగా వెళ్లి వారి కుటుంబ సభ్యుల కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వయసులో పెద్దవారైన అమితాబ్ బచ్చన్ లేదా జయా బచ్చన్ ఎక్కడ కనిపించినా అందరి ముందే వారి పాదాలకు నమస్కరిస్తారు.’మనం ఎంత పెద్ద స్టార్లయినా మనకంటే అనుభవం ఉన్న వారి ముందు తలవంచడంలో తప్పులేదు’అని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన గ్లోబల్ ఐకాన్ అయ్యారు.ఇపుడు వారి బాటలోనే రణ్ వీర్ నడవడం విశేషం.
రణవీర్ వినయానికి ఫిదా అయిన అభిమానులు
వైరల్ అవుతున్న రణవీర్ మార్క్ సంస్కారం!
ప్రస్తుతం ఈ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ‘రణవీర్ కేవలం క్రేజీ ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే కాదు, ఒక గొప్ప సంస్కారవంతుడు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాలతో ఎంతటి వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తారో, తన ప్రవర్తనతో అంతకంటే ఎక్కువ పాజిటివిటీని రణవీర్ పంచుతున్నారు.స్టార్‌డమ్ అనేది సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చే వసూళ్లలో ఉండదు.. అది ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవంలో ఉంటుందని ఈ స్టార్స్ నిరూపిస్తున్నారు.చిరు నుంచి రణవీర్ సింగ్ వరకు వీరంతా ‘రియల్ హీరోలు’ అనిపించుకోవడానికి కారణం ఈ సింప్లిసిటీనే కాబోలు.
రణవీర్ సింగ్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమ, గౌరవం ఎంతో గొప్పవి. ఇలాంటి సంఘటనలు ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెడతాయి. ఇది అందరికీ ఆదర్శం.


