|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘ధురంధర్ 2’ సునామీ! బాహుబలి 2 రికార్డులు బద్దలు! కలెక్షన్ల ఊచకోత!

Published: 23-03-2026, 2:35 AM
షాకింగ్: 'ధురంధర్ 2' సునామీ! బాహుబలి 2 రికార్డులు బద్దలు! కలెక్షన్ల ఊచకోత!
  • 5 రోజుల్లో ‘ధురంధర్ 2’ వసూళ్లు: రూ.457.25 కోట్లు (భారత్)!
  • హిందీ వెర్షన్ ద్వారా రూ.432.89 కోట్లు రాబట్టిన ‘ధురంధర్ 2’!
  • ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో రూ.691 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’!
  • ‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’ మూవీ!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ విధ్వంసం సృష్టిస్తోంది! మొదటి రోజు నుంచే రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది.

5 రోజుల్లో ‘ధురంధర్ 2’ కలెక్షన్ల సునామీ!

ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ sacnilk.com రిపోర్ట్ ప్రకారం, ‘ధురంధర్: ది రివెంజ్’ ఐదో రోజు, అంటే మొదటి సోమవారం నాడు సుమారు రూ.3.13 కోట్లు (ఉదయం 10 గంటల వరకు) వసూలు చేసింది. ఇందులో హిందీ బెల్ట్‌లో ఈ సినిమా దాదాపు రూ.2.89 కోట్లు సంపాదించింది.

మొత్తం 5 రోజుల్లో ‘ధురంధర్ 2’ దేశీయ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.457.25 కోట్లు (సోమవారం ఉదయం 10 గంటల వరకు) వసూలు చేసింది. కేవలం హిందీ వెర్షన్ కలెక్షన్లే రూ.432.89 కోట్లకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.691కోట్లు రాబట్టింది. 5వ రోజుతో 700కోట్లని దాటబోతుంది.

బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్ 2’!

మొత్తం కలెక్షన్: రూ.457.25 కోట్లు

ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమాను సుమారు రూ.225 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ లెక్కన చూస్తే, ఈ సినిమా ఇప్పటికే రూ.232 కోట్లకు పైగా లాభం సంపాదించింది. అంటే పెట్టిన బడ్జెట్‌పై 103 శాతానికి పైగా రిటర్న్స్ వచ్చాయన్నమాట. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కేటగిరీలోకి చేరిపోయింది.

ఓవర్సీస్‌లోనూ ‘ధురంధర్ 2’ ప్రభంజనం!

ఇక ధురంధర్‌ 2 బాక్సాఫీసు వద్ద ర్యాంపేజ్‌ ఆడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల కలెక్షన్లు చూస్తే, ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్‌`, `జవాన్‌` మూవీ వసూళ్లని బ్రేక్‌ చేసింది. ఇప్పుడు `బాహుబలి 2` రికార్డుని కూడా బ్రేక్‌ చేయడం విశేషం. బాహుబలి 2 సినిమాకి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.625కోట్లు వచ్చాయి. కానీ ధురంధర్‌ 2కి నాలుగు రోజుల్లో ఏకంగా రూ.691కోట్లు రావడం విశేషం. అయితే ఇది ఇంకా `పుష్ప 2`ని బ్రేక్‌ చేయలేకపోయింది. లాంగ్‌ రన్‌లో దాటేస్తుందా అనేది చూడాలి.

‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయనుంది. ఈ సినిమా మరిన్ని సంచలనాలు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.