
📌 Key Points
- ‘ధురంధర్ 2’ చిత్రం ఉగాది సందర్భంగా విడుదలై భారీ విజయం సాధించింది.
- ఈ సినిమా విడుదలై 20 రోజులు దాటినా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
- ‘ధురంధర్ 2’ హిందీలో మాత్రమే 1000 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది.
- రణవీర్ సింగ్, సారా అర్జున్ నటనకు మంచి గుర్తింపు లభించింది, ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి.
‘ధురంధర్ 2’ సినిమా ఉగాది పర్వదినాన విడుదలై ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన 20 రోజులైనా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ చిత్రం హిందీలో 1000 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా నిలిచింది.
‘ధురంధర్ 2’ ఊహించని విజయం
Dhurandhar 2:ధురంధర్ 2.. ఈ ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సీక్వెల్స్ రికార్డులు సృష్టించగలవు అని నిరూపించిన చిత్రాల జాబితాలోకి ఇది కూడా చేరింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 20 రోజులకు పైగానే అవుతున్నా.. ఇంకా థియేటర్లలో హౌస్ ఫుల్ రన్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండడం గమనార్హం. అలాంటి ఈ సినిమా తాజాగా 2000 కోట్ల కలెక్షన్లు సాధించకుండానే మరో కొత్త రికార్డు క్రియేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉన్నంతకాలం నిలిచిపోయే ఏకైక పేరు ధురంధర్.. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టలేదు. అటు కంటెంట్ పరంగా ఇటు కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ పాత రికార్డులను చెరిపి వేస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తోంది ఈ సినిమా. అంతేకాదు ఈ సినిమా రికార్డును మరో బాలీవుడ్ సినిమా అందుకుంటుందా అనే అనుమానాలు కూడా రేకెత్తించేలా చేసింది. ఇకపోతే 16 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఇంకా 2000 కోట్ల కలెక్షన్స్ రాబట్టనే లేదు అప్పుడే సరికొత్త రికార్డును సెట్ చేసింది.. మరి ఏంటా రికార్డు అనే విషయానికి వస్తే.. కేవలం హిందీ భాషలో మాత్రమే 1000 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమాగా అటు బాలీవుడ్ లోనూ ఇటు ఇండియాలోనూ సరికొత్త రికార్డు సెట్ చేసింది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు విడుదలైనా అటు పాన్ ఇండియా వైడ్ , ఇటు ఓవర్సీస్ వైడ్ ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిన సరే.. ఈ సినిమా మాత్రం కేవలం హిందీ తోనే 1000 కోట్లు రాబట్టి మొదటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఈ రికార్డు సెట్ చేసిన మొదటి సినిమాగా ధురంధర 2 పేరు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.
హిందీలో వెయ్యి కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా
నటీనటులకు లభిస్తున్న ఆదరణ
అంతేకాదు విడుదల అయ్యి 20 రోజులు పైగానే అవుతున్నా.. ఇంకా రోజుకి సుమారుగా 10 కోట్లు కలెక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే 2 వేల కోట్ల మైల్ స్టోన్ ని కూడా రీచ్ అయ్యి ఆ రికార్డును సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా నటించారు. ముఖ్యంగా ఈ చిత్రం ద్వారా నటీనటులకు మంచి పేరు రావడమే కాకుండా వీరికి ఇతర భాషల్లో కూడా అవకాశాలు లభిస్తూ ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక భవిష్యత్తులో ఈ సినిమా ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
మొత్తానికి ‘ధురంధర్ 2’ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. త్వరలోనే 2 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.


