|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2: తమిళనాడులో సంచలనం! కోర్టుకెళ్ళిన సినిమా.. ఏం జరుగుతోంది?

Published: 24-03-2026, 2:35 AM
దురంధర్ 2: తమిళనాడులో సంచలనం! కోర్టుకెళ్ళిన సినిమా.. ఏం జరుగుతోంది?
  • ‘ధురంధర్ 2’ సినిమాను తమిళనాడులో నిలిపివేయాలని కోర్టులో కేసు దాఖలు.
  • ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సినిమా ప్రభావం చూపుతుందని వాదన.
  • పాకిస్తాన్‌లో అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు చేస్తున్న అధికారులు.
  • భారతీయుడు పాకిస్తాన్ గూఢచారిగా నటిస్తున్నాడని సినిమాలో చూపడం గమనార్హం.

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్ 2’ సినిమాకు తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఒక న్యాయవాది కోర్టులో కేసు దాఖలు చేశారు.

తమిళనాడులో ‘ధురంధర్ 2’పై ఎందుకు వివాదం?

Dhurandhar 2: ‘ఉరి’ చిత్రంతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఒక్క సినిమాతో తన ఫేట్ మార్చుకున్న ఆదిత్యధర్ (Aditya Dhar)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అలాంటి ఈయన ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ ‘ధురంధర్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 5 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సరికొత్త విజయాన్ని సొంతం చేసుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా రూ.1350 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాకి కొనసాగింపుగా ధురంధర్: ది రివేంజ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా ఊచకోత కోస్తూ దూసుకుపోతోంది.

అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు తమిళనాడులో భారీ షాక్ తగిలింది అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ధురంధర్2 సినిమా ప్రభావం అక్కడి ప్రజలపై పడుతుంది అనే నేపథ్యంలోనే ఈ సినిమాను ఆపివేయాలి అంటూ ఒక అడ్వకేట్ కోర్టులో కేసు వేసినట్లు సమాచారం. ఇక కోర్టు దీనిపై విచారణ జరిపి తదుపరి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తమిళనాడు ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం పడకుండా ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి.

ఎన్నికలపై సినిమా ప్రభావం ఉంటుందా?

ఇకపోతే ఈ సినిమా ప్రభావం ఎంతలా దేశాల ప్రజలపై పడుతోందంటే ముఖ్యంగా శత్రుదేశం అయిన పాకిస్తాన్ పై ఈ సినిమా ప్రభావం గట్టిగా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక భారతీయుడు పాకిస్తాన్ స్పై రూపంలో అక్కడి విషయాలను తెలుసుకుంటున్నట్టుగా చూపించారు. అయితే ఇది నిజమేనేమో అని నమ్మిన పాకిస్తాన్ అధికారులు కూడా అక్కడి ల్యారీ ప్రాంతంలో అనుమానాధాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీలు చేస్తూ కనిపించడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ప్రభావం పాకిస్థాన్ ప్రజలపై ఏవిధంగా పడిందో అర్థం చేసుకోవచ్చు. పైగా అక్కడ ల్యారీ ప్రాంతంలో రోడ్డు పక్కన ఎవరైనా పడుకున్నా సరే వారిని లేపి మరీ పోలీసులు తనిఖీలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాకిస్తాన్‌లో ‘ధురంధర్ 2’ కలకలం!

రణ్ వీర్ సింగ్ హీరోగా, ఆదిత్యధర్ దర్శకత్వంలో.. సారా అర్జున్ హీరోగా వెండితెరకు పరిచయమవుతూ వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి భాగం ఏ రేంజ్ లో అయితే కలెక్షన్లను అందుకుంటూ దూసుకుపోతోందో ఇటు రెండవ భాగం కూడా అదే స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ.. పాత రికార్డులను చెరిపి వేస్తోంది. ఏది ఏమైనా రణ్ వీర్ సింగ్ కి ఈ సినిమా ఊహించని విజయాన్ని అందించిందని చెప్పవచ్చు.

దురంధర్ 2 చిత్రం తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.