
📌 Key Points
- టాలీవుడ్‌లో రీ-రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.
- రవితేజ, త్రిష నటించిన ‘కృష్ణ’ మే 8న రీ-రిలీజ్ కానుంది.
- డైరెక్టర్ వి.వి.వినాయక్ రవితేజ వల్లే ‘కృష్ణ’ సాధ్యమైందని పేర్కొన్నారు.
- సినిమాలో రవితేజ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీ హైలైట్‌గా నిలిచాయి.
టాలీవుడ్‌లో రీ-రిలీజ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ కోవలో మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్‌బస్టర్ ‘కృష్ణ’ సినిమా మే 8న మళ్ళీ విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ వి.వి.వినాయక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రీ రిలీజ్ ట్రెండ్: కృష్ణ ప్రత్యేకత
Krishna Re Release: ఇటీవల కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా ఎప్పుడు లేని విధంగా 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇలా రీ రిలీజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ (Raviteja)హీరోగా నటించిన పలు సినిమాలు విడుదల అయ్యి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. త్వరలోనే మరో సూపర్ హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. రవితేజ త్రిష(Trisha) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కృష్ణ(Krishna). 2008వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
వి వి వినాయక్(V.V.Vinayak) దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అప్పట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సినిమా మే 8 వ కాబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ వివి వినాయక్ వీడియోని విడుదల చేశారు. రవితేజ త్రిష నటించిన కృష్ణ సినిమా విడుదల 18 సంవత్సరాలు అవుతుంది అంటే నమ్మశక్యం కాలేదని తెలిపారు. ఈ సినిమా 18 సంవత్సరాలు తర్వాత తిరిగి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రవితేజ నటన అద్భుతమని బ్రహ్మానందం, ఇతర ఇతర నటీనటులు ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారని వివి.వినాయక్ తెలిపారు. ఇక కృష్ణ సినిమా రాజా రవీంద్ర వల్లే సాధ్యమైంది అంటూ ఈ సందర్భంగా వినాయక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వినాయక్ సంచలన వ్యాఖ్యలు: రవితేజ పాత్ర
ఈ సినిమా విడుదల సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని రవితేజ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా రవితేజ ఎనర్జీ, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ సినిమాకి హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ఇలా 2008వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులలో కూడా ఎంతో ఆత్రుత నెలకొంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ తరువాత ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
ఇరుముడి పనులలో బిజీగా రవితేజ..
అభిమానుల్లో ఉత్సాహం: సినిమా భవిష్యత్తు
ఇక రవితేజ ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. రవితేజ చివరిగా ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఒక అరడజనుకు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోయాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి (Irumudi) అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా సాగుతున్నాయి.
‘కృష్ణ’ సినిమా రీ-రిలీజ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.


