|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాక్సాఫీస్ బద్దలు: ఒకే రోజు మూడు పాన్ ఇండియా సినిమాలు! ఎవరు గెలిచేది?

Published: 03-02-2026, 1:35 AM
బాక్సాఫీస్ బద్దలు: ఒకే రోజు మూడు పాన్ ఇండియా సినిమాలు! ఎవరు గెలిచేది?
  • రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ మార్చి 19, 2026న విడుదల కానుంది.
  • అదే రోజున అడివి శేష్ ‘డెకాయిట్’, యశ్ ‘టాక్సిక్’ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
  • ‘ధురంధర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.
  • ‘టాక్సిక్’ సినిమాలో కియారా అద్వానీ, నయనతార నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ 2026 మార్చి 19న విడుదల కానుంది. అదే రోజున అడివి శేష్ ‘డెకాయిట్’, రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ సినిమాలు కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది.

‘ధురంధర్ 2’ విడుదల తేదీ ఖరారు!

Dhurandhar 2: ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన్ పాత్రలో వచ్చిన ధురంధర్ ఏ రేంజ్ హిట్ సాధించిందో తెలిసిందే. దాదాపు రూ. 1000 కోట్లు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ విడుదల కానుంది. అంతకంటే ముందుగా ఈసినిమా రిలీజ్ డేట్ విడుదల చేశారు. అది ఎప్పుడంటే.. ఈ సినిమా మార్చి 19, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 2026 మార్చి 19న బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో భారీ యుద్ధం జరగబోతోంది. ఒకే రోజున ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతుండటంతో సినీ ప్రపంచం ఒక్కసారిగా వేడెక్కింది. బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్, టాలీవుడ్ నుంచి అడివి శేష్, శాండల్‌వుడ్ నుంచి యశ్.. ఇలా ముగ్గురు స్టార్స్ తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

Read also- HBD Simbu: ప్రేమాయణం లిస్ట్ పెద్దదే.. మరి పెళ్లి సంగతేంటి ?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘ధురందర్’ మొదటి భాగం 2025 డిసెంబర్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ముగింపులోనే మేకర్స్ రెండో భాగం ‘రివెంజ్’ గురించి అనౌన్స్ చేశారు. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ దృష్ట్యా, మార్చి 19న విడుదలయ్యే ఈ సీక్వెల్‌పై బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఒకే రోజు మూడు భారీ సినిమాలు!

వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, ఈసారి ‘డెకాయిట్’ తో రాబోతున్నారు. షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయిక. వాస్తవానికి ఈ సినిమా 2025 డిసెంబర్‌లోనే రావాల్సి ఉంది, కానీ శేష్‌కు గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమై మార్చి 19కి మారింది. ఇది కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఒకేసారి విడుదల కానుంది. Read also- Illu  Illalu Pillalu Today Episode: తండ్రిని చూసి ధీరజ్ ఎమోషనల్..కొనఊపిరితో రామరాజు.. విశ్వంకు అమూల్య స్ట్రాంగ్ వార్నింగ్..

‘KGF’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. కియారా అద్వానీ, నయనతార వంటి టాప్ హీరోయిన్లు ఇందులో నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది కూడా మార్చి 19నే పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

మార్చి 19న ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగలు వరుసగా ఉండటంతో ఈ తేదీని మేకర్స్ ఎంచుకున్నారు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో ఈ ముగ్గురు హీరోలు వెనక్కి తగ్గడం లేదు. యశ్ ‘టాక్సిక్’ కన్నడ, తెలుగు మార్కెట్‌లలో బలంగా ఉండే అవకాశం ఉంది. రణవీర్ ‘ధురందర్ 2’ హిందీ బెల్ట్‌లో ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. అడివి శేష్ ‘డెకాయిట్’ కంటెంట్ పరంగా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ముగ్గురు హీరోల మధ్య ఈ త్రిముఖ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

‘టాక్సిక్’ పై అంచనాలు

Ab Bigadne Ka Waqt Aa Gaya Hai.

Dhurandhar: The Revenge Teaser Out Today at 12:12 PM #DhurandharTheRevenge Releasing In Cinemas Worldwide on 19th March 2026 in Hindi, Telugu, Tamil, Kannada & Malayalam. #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun … pic.twitter.com/KT8QHkwCMB

— Ranveer Singh (@RanveerOfficial) February 3, 2026

2026 మార్చి 19న విడుదల కానున్న ఈ మూడు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి. ఎవరి సత్తా ఏమిటో తేలిపోనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.