|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! ‘ధురంధర్ 2’ రివ్యూ: ఊహించని ట్విస్టులు, యాక్షన్ అరాచకం! రికార్డులు షేక్!

Published: 19-03-2026, 5:05 AM
రణ్‌వీర్ సింగ్ విధ్వంసం! 'ధురంధర్ 2' రివ్యూ: ఊహించని ట్విస్టులు, యాక్షన్ అరాచకం! రికార్డులు షేక్!
  • రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతం, యాక్షన్ సీన్స్‌లో దుమ్మురేపాడు – ధురంధర్ 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్!
  • సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు – ప్రతి ఒక్కరి నటన సినిమాకు హైలైట్!
  • క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది – ధురంధర్ 2 మూవీకి ప్రేక్షకుల నుండి భారీ స్పందన!
  • శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది – బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!

గతేడాది సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ సీక్వెల్ వచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం!

ట్విస్టులతో ఉర్రూతలూగించే కథనం!

Dhurandhar 2 Review In Telugu: గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ మూవీ సీక్వెల్‌ చిత్రం ‘ధురధర్: ది రివెంజ్’ థియేటర్లలోకి ఇవాళ వచ్చేసింది. రణ్‌వీర్ సింగ్ తన నట విశ్వరూపాన్ని చూపించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, అంచనాలను అందుకుందా లేదా అన్నది నేటి ధురంధర్ 2 రివ్యూలో చూద్దాం.

సినీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎన్నో అంచనాలు ఉన్న ధురంధర్: ది రివేంజ్ మూవీ ఇవాళ (మార్చి 19) థియేటర్లలో అడుగుపెట్టింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ధురంధర్ 2 సుమారు నాలుగు గంటల రన్‌టైమ్‌తో ఇండియన్ ఆడియెన్స్‌ను పలకరించింది. రణ్‌వీర్ సింగ్ ఇండియన్ స్పైగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ధురంధర్ 2 రివ్యూ లో తెలుసుకుందాం.

రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం!

అన్న చావుపై ఉజేయిర్ ఎలా పగ తీర్చుకున్నాడు? ల్యారీ పీఠంపై ఉజేయిర్‌ను కూర్చోబెట్టి జస్కిరాత్ సింగ్ అలియాస్ హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడు?, హమ్జా గతం ఏంటీ? అతను ఎందుకు ఇండియన్ స్పైగా మారాడు? ల్యారీలో ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్) నుంచి హమ్జాకు ఎదురైన సవాళ్లు ఏంటీ? మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) వేసిన ఉగ్రదాడులు ఏంటీ? వాటిని హమ్జా అడ్డుకున్నాడా? అనేది తెలియాంటే ఈ ధురంధర్ ది రివేంజ్ చూడాల్సిందే.

జస్కిరాత్ సింగ్ కుటుంబానికి జరిగిన అన్యాయం, దానికి అతను తీర్చుకున్న పగ నుంచి సినిమాను ప్రారంభించారు. ఆ సీన్లతో జస్కిరాత్ సింగ్ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉంటుందో చూపించారు. ఆ తర్వాత ల్యారీలో అర్షద్ పప్పు కింగ్ అవడం, ఆ స్థానాన్ని ఉజేయిర్ బలోచ్‌కు దక్కేలా చేస్తూ వెనుక నుంచి హమ్జా కథ అంతా నడిపించే సీన్స్ అదిరిపోతాయి.

హమ్జాపై అస్లాంకు డౌట్ రావడం, ఎలీనాకు తన భర్త నిజ స్వరూపం తెలియడంతో కథ ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. జమీల్ జమాలీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాములుగా ఉండదు. హమ్జా స్పై అని తెలియడంతో మేజర్ ఇక్బాల్ చేసే పనులు, ఎస్పీ అస్లాం అటాక్ చేయడం, ల్యారీ టాస్క్ ఫోర్స్ నుంచి హమ్జా తప్పించుకునే సీన్స్ నెక్ట్స్ లెవెల్ ఉంటాయి.

యాక్షన్ సీక్వెన్స్ అరాచకం!

ఇక క్లైమాక్స్‌కు అరగంట ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ విధ్వంసం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వరుసగా వచ్చే ట్విస్టులు థ్రిల్ పంచుతాయి. క్లైమాక్స్ అదిరిపోతుంది. శశ్వత్ సచ్‌దేవ్ అందించిన బీజీఎమ్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. కానీ, పాటలు అంతగా గుర్తుండేలా లేవు. క్లైమాక్స్ బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, విజువల్స్ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి

మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ మెప్పించాడు. ఎస్పీ అస్లాంగా సంజయ్ దత్, జమీల్ జమాలీగా రాకేష్ బేడీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆర్. మాధవన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైనా, ఉన్నంతలో తన ముద్ర వేశారు. సారా అర్జున్ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ టేకింగ్, రైటింగ్‌ అదిరిపోయింది.

దురంధర్ 2 యాక్షన్ మరియు థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతంగా ఉంది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.